శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 28 ఫిబ్రవరి 2018 (10:04 IST)

ఎన్టీఆర్ 'ఆగస్టు సంక్షోభాన్ని' నివారించలేకపోయారు.. ప్రధాని ఛాన్సొచ్చినా వద్దంటాను...

తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు స్వర్గీయ ఎన్టీ.రామారావుకు రాజకీయాలు పెద్దగా తెలియని ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. దీనికి ఓ మంచి ఉదాహరణే ఆగస్టు సంక్షోభం అని గుర్తుచే

తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు స్వర్గీయ ఎన్టీ.రామారావుకు రాజకీయాలు పెద్దగా తెలియని ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. దీనికి ఓ మంచి ఉదాహరణే ఆగస్టు సంక్షోభం అని గుర్తుచేశారు. ఆ సంక్షోభం తలెత్తినపుడు ఆయన ధీటుగా ఎదుర్కోలేక పోయారు. అపుడు నన్ను పిలవడంతో నేను రంగంలోకి సమస్యను ఓ కొలిక్కి తీసుకొచ్చాను.
 
ఆ సమయంలోనే ఆయన అనుభవమున్నవారు పార్టీలోకి కావాలని కోరడం జరిగిందన్నారు. అదేసమయంలో ఆయనను ఎదిరించి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం కూడా తనను ఎంతో బాధించిందని, ఆ తర్వాత రాష్ట్ర విభజన సమయంలో తీవ్రంగా మథనపడినట్టు చెప్పారు. 
 
1978 ఫిబ్రవరి 27న తొలిసారి ఎమ్మెల్యేగా నెగ్గిన చంద్రబాబు... 40 ఏళ్ల రాజకీయ ప్రస్థానం పూర్తి చేసుకున్న సందర్భంగా చంద్రబాబు ఓ టీవీకి ప్రత్యేక ఇంటర్వూ ఇచ్చారు. ఇందులో అన్ని విషయాలపై తన మనసులోని మాటను వెల్లడించారు. విద్యార్థి నేతగా ఉన్న సమయంలో ఆ వయసులో చేయాల్సిన పనులన్నీ చేశానని చెప్పారు. అయితే, విద్యార్థి నేతగా ఎన్నడూ కూడా విధ్వంసాన్ని, దాడులు, ప్రతిదాడులను ప్రోత్సహించలేదని, అలాగే, సిగరెట్‌ మాత్రం తాగేవాడిని కాను, విద్యార్థిగా అన్ని వేషాలూ వేశాను అని చెప్పారు.