శుక్రవారం, 22 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ivr
Last Modified: శుక్రవారం, 1 సెప్టెంబరు 2017 (18:30 IST)

ఆ 'PK'కి అంతుంటే సీఎం అయ్యేవాడు కదా... సీఎం చంద్రబాబు

కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల్లో 20 ఏళ్ల తర్వాత తెలుగుదేశం పార్టీ జెండా ఎగురబోతోంది. ఈ ఎన్నికల్లో సైకిల్ పార్టీ దూసుకుపోయింది. తెదేపా విజయంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఖుషీ ఖుషీగా వున్నారు. ఎన్నికల ఫలితాలపై మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమ

కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల్లో 20 ఏళ్ల తర్వాత తెలుగుదేశం పార్టీ జెండా ఎగురబోతోంది. ఈ ఎన్నికల్లో సైకిల్ పార్టీ దూసుకుపోయింది. తెదేపా విజయంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఖుషీ ఖుషీగా వున్నారు. ఎన్నికల ఫలితాలపై మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానాలిచ్చారు.
 
వైకాపా నాయకులు ఎన్నికల ప్రచారం సమయంలో చేసిన వ్యాఖ్యలు వారి ప్రవర్తనను చూపించాయనీ, ఇది ప్రజలు గమనించడంతో పాటు అభివృద్ధి బాటలో ఏపీని తీసుకెళ్లగలిగిన పార్టీ తెదేపా అని గుర్తించారన్నారు. కన్సల్టెంట్లతో సీఎం కుర్చీలో కూర్చోవచ్చు అని అనుకుంటే వాళ్లే అలా కావచ్చు కదా అని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. వైకాపా ప్రశాంత్ కిషోర్(PK)ను సలహాదారుగా పెట్టుకోవడంపై సీఎం స్పందించారు.