మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కె
Last Modified: విజయవాడ , మంగళవారం, 31 ఆగస్టు 2021 (15:48 IST)

సిమ్లా ప‌ర్య‌టన త‌ర్వాత తిరిగొస్తున్న జ‌గ‌న్... తాడేప‌ల్లిలో సెక్యూరిటీ రీ చెక్!

సీఎం సెక్యూరిటీ అంటే ఆషామాషీ కాదు... నిరంత‌రం డేగ క‌ళ్ల‌తో స్పెష‌ల్ పోలీసులు ప‌ర్య‌వేక్షిస్తుంటారు. అదీ, ఏపీ సీఎం వై.ఎస్. జ‌గన్మోహ‌న్ రెడ్డి సెక్యూరిటీ ఎపుడూ అల‌ర్ట్ గా ఉంటుంది. సీఎం జ‌గ‌న్ నాలుగు రోజుల క్రితం హాలీడే ట్రిప్ కి సిమ్లాకు వెళ్లారు. ఆయ‌న అక్క‌డి నుంచి తిరిగి నాలుగైదు రోజుల త‌ర్వాత గుంటూరు జిల్లా తాడేప‌ల్లిలోని త‌న క్యాంప్ కార్యాల‌యానికి చేరుకుంటున్నారు. మ‌ధ్య‌లో ఆయ‌న నేరుగా క‌డ‌ప జిల్లా పులివెందుల‌కు వెల్ళి వ‌స్తారు. అక్క‌డ త‌న తండ్రి, మాజీ సిఎం వై.ఎస్. రాజ‌శేఖ‌ర్ రెడ్డి వ‌ర్ధంతి కార్య‌క్ర‌మానికి ఆయ‌న హాజ‌ర‌వుతున్నారు. 
 
ఈలోగా తాడేప‌ల్లిలో ఏపీ సీఎం క్యాంపు కార్యాలయం వద్ద బందోబస్తును గుంటూరు అర్బన్ ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ ప‌రిశీలించారు. సీఎం జగన్మోహన్ రెడ్డి నాలుగు రోజుల పర్యటన అనంతరం తిరిగి వస్తున్న సందర్భంగా భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. హైసెక్యూరిటీ జోన్ పరిధిలో తీసుకోవాల్సిన జాగ్రత్తల పై పోలీసు సిబ్బందికి గుంటూరు అర్బన్ ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ పలు సూచనలు చేశారు.