శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Modified: మంగళవారం, 18 జూన్ 2019 (18:24 IST)

సీఎం జగన్ కూడా తప్పుదారి పట్టిస్తున్నారు... లేని హోదా కోసం: మాధవ్

ఏపీ ప్రత్యేక హోదా కోసం.. సర్ ప్లీజ్.. సర్ ప్లీజ్ అంటూనే వుంటామని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి చెప్పారు. అంతేకాదు, అసెంబ్లీలో ప్రత్యేక హోదా కావాల్సిందేనంటూ సభ్యులందరి చేత ఆమోద ముద్ర వేయించారు. ప్రత్యేక హోదా వచ్చేవరకూ అన్ని ప్రయత్నాలు చేస్తామని చెప్పారు.
 
ఐతే ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో జగన్ ప్రభుత్వం కూడా తప్పుదారి పట్టిస్తోందని భాజపా ఎమ్మెల్సీ మాధవ్ అన్నారు. అసలు ప్రత్యేక హోదా అనేదే లేదని ఎన్నిసార్లు చెప్పినా లేని హోదాను ఇవ్వమంటూ అడగడం ఏంటంటూ ప్రశ్నించారు. ఒకవేళ కేంద్రం ప్రత్యేక హోదా అనేది వుంది అని చెపితే దానికోసం తామే ముందుంటామంటూ చెప్పుకొచ్చారు. ఇప్పటికైనా లేని హోదా కోసం ప్రభుత్వం ప్రయత్నం చేయడం మానుకుంటే మంచిదని అన్నారు. 
 
ప్రత్యేక హోదాతో పారిశ్రామిక రాయితీలు వస్తాయంటూ జగన్ చెప్పిన మాటల్లోనూ వాస్తవం లేదని అన్నారు. దానికీ దీనికీ ఎలాంటి సంబంధం లేదనీ, వాస్తవాలను మాట్లాడితే బాగుంటుందని అన్నారు.