తెలంగాణలో కూడా జనసేన యాక్టివ్‌గా వుంటుంది.. పవన్ కళ్యాణ్
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలంగాణ రాజకీయాలపై చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. తెలంగాణ రాజకీయాల్లో సైతం జనసేన యాక్టివ్‌గా ఉంటుందని చెప్పారు. ఇప్పటికే ఏపీలో డబుల్ ఇంజిన్ సర్కారు నడుస్తోంది.
ఏపీలో కూటమి, అటు కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్నాయి. ఈ క్రమంలో.. పవన్ కొండగట్టు పర్యటనలో తాము తెలంగాణలోను బీజీపీతో కలిపి పనిచేస్తామంటూ వ్యాఖ్యలు చేశారు. దీంతో ఒక్కసారిగా రాజకీయాల్లో తీవ్ర రచ్చగా మారింది.
ఇక తెలంగాణలో బీజేపీ పార్టీ బలమైన అపోసిషన్ పార్టీలా ఎదిగేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తుంది. దీనిలో భాగంగానే.. ఇప్పటికే కేంద్రం, తెలంగాణకు మంత్రి వర్గంలో పెద్ద పీట వేసిందని చెప్పుకోవచ్చు.
ఇప్పటికే బండి సంజయ్, కిషన్ రెడ్డిలకు కీలక శాఖలను కేటాయించింది. ఈ నేపథ్యంలో తాజాగా, పవన్ కళ్యాణ్, బీజేపీతో కలిసి పనిచేస్తామంటూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి.