బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : సోమవారం, 22 జులై 2024 (19:45 IST)

మదనపల్లె సబ్ కలెక్టర్ ఆఫీసులో అగ్నిప్రమాదం ప్రమాదవశాత్తు జరిగింది కాదు... డీజీపీ (Video)

Dwaraka Tirumala Rao
మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైళ్ల దగ్ధంపై ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఘటన ప్రమాదవశాత్తు జరిగింది కాదన్నారు. ఆయన సోమవారం ఈ ప్రమాదం జరిగిన సబ్ కలెక్టర్ కార్యాలయాన్ని పరిశీలించారు. ప్రమాదం జరిగిన తీరు తెన్నులను ఆరా తీశారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు. 
 
'మదనపల్లె ఘటన ప్రమాదం కాదు. గత రాత్రి 11:30 గంటలకు అగ్నిప్రమాదం జరిగింది. ప్రమాదం పలు అనుమానాలకు తావిస్తోంది. ఘటన ప్రమాదవశాత్తు జరిగింది కాదు. రాత్రి ప్రమాదం జరిగితే వెంటనే కలెక్టర్‌కు సమాచారం ఇవ్వలేదు. ఆర్డీవో ఆఫీస్‌‌లో కీలక ఫైల్స్ ఉన్న విభాగంలో అగ్నిప్రమాదం జరిగింది. ఆర్డీవో కార్యాలయం కిటికీ బయట అగ్గిపుల్లలు కనిపించాయి. వోల్టేజ్ తేడాలు లేవు.. షార్ట్ సర్క్యూట్‌కు అవకాశమే లేదు. ఆర్డీవో ఆఫీస్‌లో కొన్ని సీసీ కెమెరాలు పనిచేయట్లేదు. త్వరలో అన్ని వివరాలు బయటికొస్తాయి' అని ఆయన పేర్కొన్నారు.