శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : ఆదివారం, 30 సెప్టెంబరు 2018 (11:19 IST)

పవన్ హత్యకు కుట్రపన్నిన ఆ ముగ్గురు? డీజీపీ ఏమంటున్నారు

జనసేన పార్టీ అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్ హత్యకు ముగ్గురు కుట్ర పన్నినట్టు వార్తలు వచ్చాయి. వీటిపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ ఆర్పీ ఠాకూర్ స్పందించారు. పవన్‌ కళ్యాణ్‌కు పూర్తిస్థాయి రక్షణ కల్పించే

జనసేన పార్టీ అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్ హత్యకు ముగ్గురు కుట్ర పన్నినట్టు వార్తలు వచ్చాయి. వీటిపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ ఆర్పీ ఠాకూర్ స్పందించారు. పవన్‌ కళ్యాణ్‌కు పూర్తిస్థాయి రక్షణ కల్పించేందుకు సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు.
 
ఇదే అంశంపై ఆయన స్పందిస్తూ, ఒక్క పవన్ కళ్యాణ్‌కు మాత్రమే కాకుండా, రాష్ట్రంలో సీఎం నుంచి సామాన్యుని వరకూ.. ఐదు కోట్ల మంది ఆంధ్రుల రక్షణ బాధ్యత తమదేనని స్పష్టం చేశారు. పవన్‌ కల్యాణ్‌పై హత్యకు కుట్ర పన్నిన ఆ ముగ్గురి వ్యక్తుల గురించి ఆధారాలు అందజేస్తే చట్టపరంగా చర్యలు తీసుకోవడానికి నిమిషం కూడా వెనుకాడబోమని భరోసా ఇచ్చారు. 
 
ఇకపోతే, పోలీసులకు ఐపీసీ, సీఆర్‌పీసీ తప్ప రాజకీయ పార్టీల గురించి అవసరం లేదన్నారు. ఈ విషయమై ఇప్పటికే పశ్చిమ గోదావరి ఎస్పీకి సమాచారం అందించామన్నారు. పవన్‌ కల్యాణ్‌ వద్ద ఆధారాలు తీసుకొని చట్టపరమైన చర్యలు చేపట్టేపనిలో ఆయన ఇప్పటికే నిమగ్నమై ఉన్నారన్నారు. రాష్ట్రంలో ఎవరికి ప్రాణాపాయం ఉన్నా తమ దృష్టికి తీసుకొస్తే రక్షణ కల్పిస్తామని ఆయన హామీ ఇచ్చారు.