శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Srinivas
Last Modified: మంగళవారం, 29 మే 2018 (13:42 IST)

చంద్ర‌బాబు వ‌ల్లే ప్ర‌త్యేక హోదా రాకుండా పోయింది: ప‌వ‌న్ క‌ళ్యాణ్

జ‌న‌సేన పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ మ‌రోసారి చంద్ర‌బాబు పైన ఫైర్ అయ్యారు. శ్రీకాకుళం జిల్లా ప‌ర్య‌ట‌న‌లో ప‌వ‌న్ మాట్లాడుతూ... కిడ్నీ బాధితుల కోసం మండలానికో డయాలిసిస్ కేంద్రం పెట్టాలని, అందుకు చంద్రబాబు తన డబ్బులేమీ ఖర్చు పెట్టక్కర్లేదని, ప్రభుత్వం

జ‌న‌సేన పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ మ‌రోసారి చంద్ర‌బాబు పైన ఫైర్ అయ్యారు. శ్రీకాకుళం జిల్లా ప‌ర్య‌ట‌న‌లో ప‌వ‌న్ మాట్లాడుతూ... కిడ్నీ బాధితుల కోసం మండలానికో డయాలిసిస్ కేంద్రం పెట్టాలని, అందుకు చంద్రబాబు తన డబ్బులేమీ ఖర్చు పెట్టక్కర్లేదని, ప్రభుత్వం డబ్బే కదా ఖర్చుపెట్టేదని  అన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో ప్రభుత్వాల వైఖరిని నిరసిస్తూ పాలకొండ, రాజాం నియోజకవర్గ కేంద్రాల్లో కవాతు చేశారు.
 
అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పవన్ మాట్లాడుతూ... ‘50 గ్రామాల ప్రజలు ఆముదాలవలస - రాజాంల మధ్య బలశాల దగ్గర వంతెన కావాలని ఆందోళన చేస్తుంటే ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. రాజాంలో ప్రభుత్వ కాలేజీ లేదు. అభివృద్ధి అంటే అమరావతి మాత్రమే కాదు రాజాం అని కూడా గుర్తుపెట్టుకోండి. మీ అవినీతిని ప్రశ్నించినందుకు 15 మంది జనసేన సైనికుల్ని జైళ్లలో పెట్టారు. 
 
గత ఎన్నికల్లో మీకు మద్దతు ఇస్తే చేసేది ఇదా? మీ అవినీతిని చూస్తూ సహించం... చొక్కా పట్టుకొని నిలదీస్తాం. 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తుడిచి పెట్టుకుపోతుంది. ముఖ్యమంత్రి రాజీపడటం వల్ల, ఆయన కాంట్రాక్టుల కోసం రాజీపడటంతో రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాకుండాపోయింది" అని అన్నారు.