శుక్రవారం, 8 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 16 నవంబరు 2021 (10:24 IST)

గులాబీ తుపాను.. నష్టపోయిన రైతులకు రూ.22 కోట్లు విడుదల

ఆంధ్రప్రదేశ్‌లో ఈ ఏడాది సెప్టెంబర్‌లో గులాబీ తుపాను కారణంగా నష్టపోయిన పంటలకు ప్రభుత్వం రైతులకు పెట్టుబడి రాయితీగా రూ.22 కోట్లు విడుదల చేయనుంది. మంగళవారం క్యాంపు కార్యాలయంలో జరిగే కార్యక్రమంలో సీఎం జగన్ రైతుల ఖాతాల్లో ఈ నిధులను జమ చేయనున్నారు.
 
పంటలు నష్టపోయిన మొత్తం 34,586 మంది రైతులకు పెట్టుబడి రాయితీ అందిస్తున్నట్లు ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. రెండు వారాలుగా కురుస్తున్న వర్షాల వల్ల జరిగిన నష్టాన్ని అంచనా వేసేందుకు క్షేత్రస్థాయిలో బృందాలను ఏర్పాటు చేశారు. 
 
కడప, అనంతపురం జిల్లాల్లో వానాకాలం పంట నష్టపోయిన రైతులకు 80% రాయితీపై విత్తనాలు సరఫరా చేస్తున్నామని, రబీ చివరి నాటికి పంట నష్టపోయిన వారందరికీ పెట్టుబడి రాయితీ అందజేస్తామని ప్రభుత్వం తెలిపింది.