శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , బుధవారం, 20 అక్టోబరు 2021 (12:08 IST)

ముందుగానే పట్టాభికి స్క్రిప్ట్ రాసిచ్చి... ప్రేరేపించిన చంద్రబాబు

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల‌ను ప్రజలు గమనిస్తున్నార‌ని, రాజకీయ స్వలాభం కోసం చంద్ర‌బాబు కుయుక్తులు ప‌న్నుతున్నార‌ని రాష్ట్ర ప్ర‌భుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి ఆరోపించారు. సొంత పార్టీని కాపాడుకోలేక వికృత క్రీడలకు పాల్పడుతున్న చంద్రబాబు త‌న హుందాతనం సైతం కోల్పోయేలా ప్రవర్తిస్తున్నార‌న్నారు. 
 
న‌ల‌భై ఏళ్ల చరిత్ర అని చెప్పే చంద్రబాబు తన అనుచరులతో మాట్లాడించిన తీరు దారుణం అని, అస‌లే ప్రజలు కష్టాల్లో ఉన్న సమయంలో స‌మ‌స్య‌లు సృష్టిస్తున్నార‌ని అన్నారు. విజయవాడలో లేని  వ్యక్తి ముందస్తు ప్రణాళికల ప్రకారం రెచ్చగొట్టారు... వ్యక్తిగతంగా టార్గెట్ చేసి మాట్లాడాలి అనే ధోరణిలో చంద్రబాబు తీరు.. ఈ విష క్రీడలో భాగంగా ఘోరాతి ఘోరంగా చంద్రబాబు ముఖ్యమంత్రిపై వ్యాఖ్యలు చేయించారు అని ఆరోపించారు. ముందుగానే పట్టాభికి ఫలానా వ్యాఖ్యలు చేయాలని సూచించిన చంద్రబాబు కావాల‌నే రెచ్చ‌గొడుతున్నార‌ని చెప్పారు.
 
ఇన్ని రోజులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సంయమనంతో ఉండలాని కోరార‌ని, కానీ కార్యకర్తలు, నాయకులు సంయమనం కోల్పోయే పరిస్థితి చంద్రబాబు తెస్తున్నార‌న్నారు. చంద్రబాబు మాట్లాడే బాష ఎలాంటిదో ప్రజలు చూస్తున్నారు... అస‌లు చంద్రబాబు ఆకస్మికంగా ఎందుకు ఎపికి వచ్చారు? తన అనుచరులు, మాజీ మంత్రులతో నీచంగా మాట్లాడిస్తున్నారు. వయసు పెరిగే కొద్దీ చంద్రబాబు తీరు దారునంగా తయారైంది. సిగ్గుమాలిన వ్యక్తి చంద్రబాబు... పట్టాభి మాట్లాడిన మాటలు కన్న తల్లులు, ఆడవారిని కించపరిచేలా లేవా? ఎందుకు చంద్రబాబుకు ఇంత దిగజారుడుత‌నం? ఎంత కాలం ప్రజలు స‌హిస్తారు ఇలాంటి వికృత క్రీడ? అని శ్రీకాంత్ రెడ్డి ప్ర‌శ్నించారు. 
 
కుట్ర  రాజకీయాలకు తెరలేపుతున్న చంద్రబాబు త‌గిన మూల్యం చెల్లించాల్సి వ‌స్తుంద‌న్నారు. పట్టాభి మాట్లాడే మాటలు ఎవరికి వర్తిస్తాయి? మగాడి లాగా దేశ చరిత్రలో అత్యధిక మెజారిటీతో గెలిచిన వ్యక్తి ముఖ్యమంత్రి వైఎస్ జగన్... మీరు మాట్లాడిన పదాలు, వ్యాఖ్యలు మీకే వర్తిస్తాయి... అన్నారు.
 
గతంలో పరిటాల హత్య జరిగిన సమయంలో అల్లర్లను ప్రేరేపించింది ఎవరు? రాజకీయాల కోసం ఇంతలా దిగజారుతారా? వెన్నుపోటు, కరువు చంద్రబాబుకు బిరుదులు..నాడు సొంత మామా ను వెన్నుపోటు పొడిచి వచ్చిన వ్యక్తి చంద్రబాబు.. అనునిత్యం ప్రజల ఆదరణ పొందుతున్న వైఎస్ జగన్ ను చూసి ఓర్వలేక కుట్రలు చేస్తున్నార‌ని ఆరోపించారు.