మంగళవారం, 12 ఆగస్టు 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 6 జూన్ 2024 (21:08 IST)

టీటీడీలో ప్రక్షాళన: టీటీడీ ఛైర్మన్‌గా నాగబాబు.. ఆరోజున ప్రకటన

Nagababu
Nagababu
పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపును నమోదు చేసుకుంది. అయితే ఈసారి ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ తన బంధువులు ఎవరినీ తన పార్టీ తరపున నిలబెట్టలేదు. ముఖ్యంగా తన సోదరుడు నాగబాబుని కూడా ఎక్కడా నిలబెట్టలేదు. 
 
నాగబాబు మొదటినుండీ తన తమ్ముడు పవన్ కళ్యాణ్‌కి అండగా ఉంటూ, పార్టీకి ఎంతో సేవ చేశారు. అయితే ఇప్పుడు నాగబాబుకి ఏదైనా ఒక కీలక పదవి ఇవ్వాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నట్టుగా తెలిసింది. అందుకే రాష్ట్రంలో అతి ముఖ్యమైన తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు చైర్మన్‌గా నాగబాబు పేరుని పవన్ కళ్యాణ్ సూచించినట్టుగా తెలిసింది. 
 
మెగా అభిమానులు కూడా నాగబాబు టీటీడీ చైర్మన్‌గా భాద్యతలు చేపట్ట నున్నారని సంబరాలు కూడా చేసుకుంటున్నట్టుగా తెలిసింది. టీటీడీలో ఎన్నో అవకతవకలు జరుగుతున్నాయని, అందుకు ఎంతో ప్రక్షాళన చెయ్యాల్సి ఉందని, అందుకోసమే నాగబాబు పేరుని పవన్ కళ్యాణ్ సూచించినట్టుగా తెలుస్తోంది. 
 
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసిన తరువాత నాగబాబుని టీటీడీ చైర్మన్‌గా చేస్తూ అధికారిక ప్రకటన వెలువడవచ్చు.