సోమవారం, 18 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 16 ఏప్రియల్ 2021 (11:10 IST)

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రైవేటు డిగ్రీ కాలేజీలకు ఫీజుల ఖరారు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రైవేట్, అన్‌ఎయిడెడ్ డిగ్రీ కాలేజీలకు ప్రభుత్వం ఫీజులను ఖరారు చేసింది. ఈ మేరకు ఏపీ ఉన్నత విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. 2020-21, 2022-23 విద్యా సంవత్సరానికి కమిషన్ నిర్ధారించిన ఈ ఫీజు అమలు చేయాలని ఆదేశించింది. 
 
సైన్స్‌, ఆర్ట్స్‌ విభాగాలల్లోని పీజీ కోర్సులకు సైతం ఫీజులు ఖరారు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వార్షిక ఫీజులోనే ట్యూషన్‌, అఫిలియేషన్‌, ఐడీ కార్డు, స్టడీ టూర్ ఫీజులు కలిసి ఉంటాయని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. నిబంధనలు ఉల్లంఘించే విద్యాసంస్థలపై కఠిన చర్యలు తీసుకుంటామని ఉన్నత విద్యాశాఖ హెచ్చరించింది.
 
కోర్సులు.. వాటి వార్షిక ఫీజుల వివరాలు 
మాస్టర్‌ ఆఫ్‌ సైన్స్‌ అండ్ టెక్నాలజీ కోర్సులో చేరేందుకు రూ.27,000 చెల్లించాల్సివుంటుంది. అలాగే,  కెమిస్ట్రీ రూ.33,000,  బయోటెక్నాలజీ రూ.37,400, కంప్యూటర్‌ అప్లికేషన్స్‌ రూ.24,200, జెనెటిక్స్‌ రూ.49,000, ఎంఏ, ఎంకామ్‌  రూ.15,000 నుంచి రూ.30,000 ఖరారు చేసింది.