గురువారం, 2 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 1 ఫిబ్రవరి 2022 (09:07 IST)

పీఆర్సీకి వ్యతిరేకంగా ఆందోళన - 27 మంది మెమోలు ఇచ్చిన సర్కారు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన కొత్త పీఆర్సీకి వ్యతిరేకంగా ప్రభుత్వ ఉద్యోగులంతా ఆందోళన చేస్తున్నారు. అన్ని శాఖలకు చెందిన ప్రభుత్వ ఉద్యోగులు ఈ ఉద్యమంలో పాల్గొన్నారు. తాజాగా వైద్య ఆరోగ్య శాఖ, ఆర్టీసీ ఉద్యోగులు కూడా ఆందోళనకు మద్దతు ప్రకటించారు. ఈ క్రమంలో ఈ నెల 7వ తేదీన  నిరవధిక సమ్మెకు దిగనున్నారు. 
 
అయితే, కొత్త పీఆర్సీకి వ్యతిరేకంగా ఉద్యోగులంతా ఆందోళన చేస్తుంటే, బిల్లుల ప్రాసెసింగ్‌లో నిర్లక్ష్యం వహించారంటూ 53 మంది ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం మెమోలు జారీచేసింది. వీరిలో 27 మంది డీడీవోలు, ఎస్టీవోలు, ఏటీవోలు ఉన్నారు. వీరిలో ముగ్గురు డైరెక్టర్లు, సబ్ ట్రెజరీ అధికారులు 21 మంది, ఏటీవోలు ఇద్దరు ఉన్నారు. 
 
వేతనాల బిల్లులు పంపంపలేదని డీడీవోలకు, ట్రెజరీకి చేరిన బిల్లులను ప్రాసెస్ చేయనందుకు మిగిలి ట్రెజరీ అధికారులకు ఈ మమోలు జారీచేసిట్టు ప్రభుత్వం వివరణ ఇచ్చింది. మరోవైపు మెమోలు అందుకునే ఉద్యోగులు ఇందుకు సంబంధించి ఉన్నతాధికారులను కలిసి వివరణ ఇవ్వాల్సివుంటుంది. ఈ వివరణకు ఉన్నతాధికారులు సంతృప్తి చెందకుంటే మాత్రం మెమోలు స్వీకరించిన ఉద్యోగులపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటారు.