శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By PNR
Last Updated : మంగళవారం, 29 జులై 2014 (11:38 IST)

పోలవరం : ముంపు మండలాలను ఏపీలో కలుపుతూ జీవో జారీ!

ఖమ్మం జిల్లాలోని పోలవరం ప్రాజెక్టు ముంపు గ్రామాలను ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో కలుపుతూ ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఏపీ విభజన చట్టం సవరణ మేరకు ఉమ్మడి రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాలో ఉన్న మండలాలను ఆయా జిల్లాల్లో కలుపుతున్నట్లు ఏపీ రాష్ట్ర రెవెన్యూశాఖ ముఖ్య కార్యదర్శి జేసీ శర్మ ఉత్తర్వు జారీ చేశారు. 
 
ఈ నోటిఫికేషన్ ప్రకారం... బూర్గంపాడు, వేలేరుపాడు, కుక్కునూరు మండల్లోని గ్రామాలు పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం రెవెన్యూ డివిజన్‌లోకి వెళతాయి. అలాగే కూనవరం, చింతూరు, వీఆర్ పురం మండలాలు, భద్రాచలం పట్టణం మినహా మిగిలిన భద్రాచలం మండలం మొత్తం తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం రెవిన్యూ డివిజన్ పరిధిలోకి వెళతాయి. 
 
దీనికి సంబంధించి ఆయా జిల్లాల కలెక్టర్లు విస్తృత ప్రచారం కల్పించాలని... ప్రజల నుంచి అభ్యంతరాలను స్వీకరించాలని ఏపీ రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి జేసీ శర్మ ఆదేశాలు జారీ చేశారు. 30 రోజుల వ్యవధిలో ప్రజల అభ్యంతరాలను పూర్తి స్థాయి నివేదిక రూపంలో రెవెన్యూ శాఖకు అందజేయాలని ఆదేశించారు.