బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 10 ఆగస్టు 2022 (16:06 IST)

ఏపీలో ఉత్తమ స్కూల్స్‌ ఇవే... ఎంపిక చేసిన సర్కారు

New districts in Andhra Pradesh
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉత్తమ ఫలితాలు సాధించిన ఏడు పాఠశాలలను బెస్ట్ స్కూల్స్‌గా ఎంపిక చేశారు. ఈ ఏడు స్కూల్స్‌లలో వందశాతం ఉత్తీర్ణతతో అధిక మార్కులు సాధించాయి. ఏడు ప్రభుత్వం పాఠశాలలను బెస్ట్ స్కూల్స్‌గా ప్రభుత్వం ఎంపిక చేసింది. ఈ నెల 15వ తేదీన జరిగే స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో బెస్ట్ స్కూల్స్‌గా ఎంపికైన వాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జ్ఞాపికలను అందజేయనున్నారు. 
 
ఉత్తమ స్కూల్స్‌గా ఎంపికైన ఈ ఏడు పాఠశాలలను పరిశీలిస్తే, శ్రీకాకుళం జిల్లా కింతలి జెడ్పీ హైస్కూలు, విజయనగరం జిల్లా పెరుమాలి ఏపీ మోడల్ స్కూలు, విజయనగరం జిల్లా భద్రగిరి గిరిజన సంక్షేమ బాలికల హైస్కూలు, విజయనగరం జిల్లా తాటిపూడి ఏపీ బాలికల రెసిడెన్షియల్ హైస్కూలు, ప్రకాశం జిల్లా హనుమంతునిపాడు జెడ్పీ ఉన్నత పాఠశాల, ప్రకాశం జిల్లా రాయవరం బాలికల సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూలు, కర్నూలు జిల్లా డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం మెమోరియల్ మునిసిపల్ కార్పొరేషన్ హైస్కూలు, శ్రీకాకుళం జిల్లా వంగర కేజీబీ విద్యాలయంలు బెస్ట్ స్కూల్స్‌గా ఎంపికయ్యాయి.