ఆదివారం, 6 ఏప్రియల్ 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 4 ఏప్రియల్ 2025 (13:01 IST)

రాంగోపాల్ వర్మపై తొందరపాటు చర్యలు వద్దు : ఏపీ హైకోర్టు

ramgopalvarma
వివాదాస్పద దర్శకుడు, నిర్మాత రాంగోపాల్ వర్మపై ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దని ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. దీంతో వర్మకు ఊరట లభించింది. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేశ్‌లపై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేయడం, మార్ఫింగ్ ఫోటోలను షేర్ చేసిన కేసులో విచారణకు హాజరుకావాలంటూ వర్మకు ఏపీ సీఐడీ పోలీసులు నోటీసులు జారీచేశారు. 
 
అయితే, సీఐడీ ఇచ్చిన నోటీసులను హైకోర్టులో వర్మ సవాల్ చేశారు. ఈ పిటిషన్‌ను విచారించిన హైకోర్టు దర్శకుడు రాంగోపాల్ వర్మకు ఊరటనిచ్చింది. అలాగే, వర్మపై తొందరపాటు చర్యలు తీసుకోవద్దని సీఐడీకి ఆదేశాలు జారీచేసింది. తదుపరి విచారణను వాయిదా వేసింది.