శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 20 డిశెంబరు 2021 (19:22 IST)

జగన్ సర్కారుకు షాక్ - సౌర విద్యుత్ ధరపై వివరణ కోరన హైకోర్టు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు తేరుకోలేని షాకిచ్చింది. సౌర విద్యుత్ కొనుగోళ్ళ ధరపై వివరణ ఇవ్వాలని సోమవారం ఆదేశాలు జారీచేసింది. సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సెకి) నుంచి సౌర విద్యుత్‌ను కొనుగోలు చేయడంపై సీపీఐ నేత రామకృష్ణ హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు... ఎక్కువ ధరకు సౌర విద్యుత్‌ను ఎందుకు కొనుగోళ్లు చేయాల్సి వచ్చిందో వివరించాలని నోటీసులో ప్రశ్నించింది. 
 
గతంలో సెకి నుంచి భారీ ఎత్తు సౌర విద్యుత్ కొనుగోలుకు ఏపీ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దీనికి ఏపీ ఈఆర్సీ కూడా సమ్మతం తెలిపింది. అయితే, అధిక ధరకు ఈ విద్యుత్‌ను కొనుగోలు చేస్తున్నట్టు విపక్ష సభ్యులు ఆరోపించారు. అయినప్పటికీ వీరి అభ్యంతరాలను ఏమాత్రం పట్టించుకోలేదు. సోలార్ పవర్ కొనుగోళ్ళల పెద్ద ఎత్తున అవినీతి జరుగుతుందన్నది సీపీఐ రామకృష్ణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 
 
ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన హైకోర్టు... ఏపీ సర్కారుకు నోటీసులు జారీచేసింది. ఎక్కువ ధర చెల్లించి సౌర విద్యుత్‌ను ఎందుకు కొనుగోలు చేయాల్సి వచ్చిందో వివరణ ఇవ్వాలంటూ నోటీసులు జారీచేసింది.