బుధవారం, 1 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 3 ఫిబ్రవరి 2022 (14:22 IST)

గుంటూరులోని జిన్నా టవర్‌కు ప్రత్యేక స్థానం : హోం మంత్రి సుచరిత

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లాలో ఉన్న జిన్నా టవర్‌కు ప్రత్యేక స్థానం ఉందని హోం మంత్రి మేకతోటి సుచరిత అన్నారు. ఎన్నో దశబ్దాలుగా ఉన్న ఈ జిన్నా టవర్ పేరు మార్చాలంటూ భారతీయ జనతా పార్టీకి చెందిన నేతలు డిమాండ్ చేస్తూ వివాదాస్పదం చేస్తున్నారు. గతంలో ఒకసారి ఈ టవర్‌ను ముట్టడించి పేరు మార్చేందుకు ప్రయత్నం కూడా చేశారు. 
 
దీనిపై హోం మంత్రి సుచరిత మాట్లాడుతూ, ఎన్నో దశాబ్దాలుగా ఉన్న ఈ జిన్నా టవర్‌ను అడ్డుపెట్టుకుని రాజకీయాలు చేయడం సిగ్గుచేటన్నారు. ప్రజల్లో జాతీయ భావాలు పెంచాల్సిన దేశ పాలకలు ప్రజల మధ్య చిచ్చు పెట్టాలని భావిస్తున్నారంటూ ఆరోపించారు. జాతీయ స్థాయిలో అధికారంలో ఉన్న బీజేపీ కులమాతల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తుందని ఆయన ఆరోపించారు. ఈ టవర్‌కు ప్రత్యేక స్థానం ఉందని చెప్పారు.