శుక్రవారం, 22 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 10 జనవరి 2020 (13:50 IST)

'అమ్మ ఒడి' తర్వాత మధ్యాహ్న భోజన పథకం- మెనూలో.. 5 రోజులు ఎగ్ కంపల్సరీ

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గురువారం అమ్మఒడి పథకాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. జవనరి 9న నవరత్నాల్లో భాగమైన 'అమ్మ ఒడి' పథకానికి చిత్తూరు జిల్లా నుంచి శ్రీకారం చుట్టారు. ఇక త్వరలోనే పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయనున్నారు. ఇందులో భాగంగా మధ్యాహ్న భోజన పథకం మెనూలో భారీ మార్పులకు శ్రీకారం చుట్టబోతున్నారు. 
 
జనవరి 21 వ తేదీ నుంచి మధ్యాహ్న భోజన పథకంలోని ఆహార పదార్థాల్లో క్వాలిటీ పెంచడంతో పాటు, రకరకాలు వెరైటీలను అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. దీనివల్ల ప్రభుత్వంపై రూ.353 కోట్ల అదనపు భారం పడనుందని అంచనా. అయినా కూడా మెనూ మార్పులు చేసేందుకు జగన్మోహన్ రెడ్డి సర్కారు వెనుకడుగు వేయట్లేదు. పాఠశాల విద్యార్థులను దృష్టిలో పెట్టుకుని.. పిల్లలకు పౌష్టికాహారం అందించే దిశగా ఈ మార్పులు తీసుకుంటోంది జగన్ సర్కారు. 
 
ఇక మెనూను ఓ సారి పరిశీలిస్తే.. 
పాఠశాలల్లో సోమవారం: అన్నం, పప్పుచారు, గుడ్డు కూర, ఏదైనా స్వీట్
మంగళవారం: టమాట పప్పు, పులిహోర, బాయిల్డ్ ఎగ్
బుధవారం: వెజిటబుల్ రైస్, ఆలు కుర్మా, ఉడికించిన గుడ్డు, ఏదైనా స్వీట్
గురువారం: బాయిల్డ్ ఎగ్, కిచిడీ, టమాట చట్నీ
 
శుక్రవారం: అన్నం, ఆకుకూర పప్పు, ఉడికించిన గుడ్డు, ఏదైనా స్వీట్
శనివారం: అన్నం, సాంబారు, స్వీట్ పొంగల్
ఈ మెనూలో ఉడికించిన కోడిగుడ్డును ఐదురోజులు అందించనున్నారు.