Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

జగన్ అందర్నీ తనకోసం వాడుకోవాలని చూసే వ్యక్తి... ఆదినారాయణ రెడ్డి

శుక్రవారం, 27 అక్టోబరు 2017 (19:40 IST)

Widgets Magazine
adinarayana reddy

అమరావతి: రైతు ఉత్పత్తులు మార్కెట్‌కు సకాలంలో చేరడానికి వీలుగా మార్కెట్ యార్డులు ప్రతి ఏటా లింక్ రోడ్లు అవసరాలకు అనుగుణంగా ఏర్పాటు చేయడానికి తగిన నిధుల్ని ప్రభుత్వ పరంగా కూడా అందచేయనున్నట్లు రాష్ట్ర మార్కెటింగ్, గిడ్డంగులు, పశుగణాభివృద్ధి , పాడిపరిశ్రమ, మత్స్య పరిశ్రమ, సహకార శాఖల మంత్రి ఆదినారాయణ రెడ్డి ప్రకటించారు. ఇప్పటిదాకా ఆయా మార్కెట్ యార్డులు తమ ఆదాయంలో ప్రతి ఏటా 20 శాతం నిధులతో లింక్ రోడ్లు ఏర్పాటుకు అవకాశం ఉంది. 
 
ఈ నిధుల వ్యయానికి కూడా అనుమతులంటూ జాప్యం అవుతోంది. దీన్ని గుర్తించిన మంత్రి ఇక నుంచి అనుమతుల్లో జాప్యం ఉండదు, అంతేగాక ఇక నుంచి ప్రభుత్వం నుంచి కూడా మరో 20 శాతం నిధుల్ని లింక్ రోడ్ల ఏర్పాటుకు సమకూర్చనున్నట్లు మంత్రి తెలిపారు. వ్యవసాయదారులకు స్నేహ హస్తంగా ఉండాలన్నది తన ధ్యేయం అని అందుకు అనుగుణంగా మార్కెట్ యార్డులు కార్యకలాపాలు విస్తృతం చేయాలని అన్నారు. 
 
మంత్రి శుక్రవారం మధ్యాహ్నం అమరావతి సమీపంలోని తాడికొండ వ్యవసాయ మార్కెట్ యార్డులో కొత్తగా 2 వేల టన్నుల నిల్వ సామర్ధ్యంతో రూ. 1.20 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న గోదాము నిర్మాణానికి భూమిపూజ, కార్యాలయ నూతన భవనం ప్రారంబోత్సవం చేశారు. ఈ సంధర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన రైతు సదస్సులో మంత్రి ప్రసంగించారు. మార్కెట్ యార్డులకు ఏ సమస్య ఉన్నా తన వద్దకు నేరుగా వచ్చి పరిష్కరించుకోవచ్చునని మంత్రి తెలిపారు. 
 
రైతు సంక్షేమానికి ఈ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి పునరుద్ఘాటించారు. రాష్ట్ర రాజకీయాలు బాగుండాలంటే ఈ ప్రభుత్వానికే అందరూ మద్దతు పలకాలని కోరారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రాభివృద్ధి కోసం అహర్నిశలూ కృషి చేస్తున్నారని అన్నారు. ఆయన పట్టుదల, అందుకు చూపుతున్న ఏకాగ్రత, కృషి, ఆలోచనలు ఎవరికీ సాధ్యం కాదని అన్నారు. అదే ప్రతిపక్ష నేత జగన్ అందర్నీ తనకోసం వాడుకోవాలని చూసే వ్యక్తి అని పేర్కొన్నారు. 
 
అందర్నీ తన అభివృద్ధి కోసం, తాను ముఖ్యమంత్రి కావాలని భగవంతుడిని ప్రార్ధించాలనే ప్రతినాయకుడి లాంటి వ్యక్తి అని దుయ్యబట్టారు. ఆయన ఆస్తి ఇప్పుడు లక్ష కోట్లు కాదని, అది ఇప్పుడు ఆరేడు కోట్ల లక్షల కోట్ల రూపాయలుగా ఉంటుందని గుర్తుచేశారు. ఈ రాష్ట్రానికి పాలిచ్చే కామధేనువు లాంటి ముఖ్యమంత్రి చంద్రబాబు లాంటి వ్యక్తి కావాలా, ప్రతినాయకుడు లాంటి జగన్ లాంటి వ్యక్తి కావాలా అని మంత్రి ప్రశ్నించారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

హైదరాబాద్ డ్రగ్స్ కేసులో కేటీఆర్‌కు సంబంధం : రేవంత్ రెడ్డి

తెలంగాణలో ఇటీవల వెలుగుచూసిన డ్రగ్స్ మాఫియాపై ఈడీతో విచారణ జరిపించాలని టీటీడీపీ నేత రేవంత్ ...

news

రోబోకు పౌరసత్వం ఇచ్చిన సౌదీ అరేబియా: రోబోతో ఇంటర్వ్యూ (వీడియో)

విదేశాల్లో పౌరసత్వం లభించడం క్లిష్టమైన తరుణంలో మహిళా రోబోకు సౌదీ అరేబియా పౌరసత్వం ...

news

అసెంబ్లీని బహిష్కరిస్తున్నాం... రాష్ట్రపతికి జగన్ లేఖ

త్వరలో జరుగనున్న ఏపీ అసెంబ్లీ సమావేశాలను ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్ఆర్ సీపీ ...

news

ఆర్టీసీ బస్సు జనంపైకి ఎలా దూసుకొస్తుందో చూడండి? (Video)

విజయవాడలో దారుణం జరిగింది. స్థానిక అజిత్‌సింగ్‌నగర్‌ సమీపంలోని బుడమేరు వంతెన వద్ద ...

Widgets Magazine