పోలవరాన్ని జగన్‌ పూర్తి చేస్తారు: మంత్రి అనిల్

anil kumar yadav
ఎం| Last Updated: గురువారం, 11 జులై 2019 (15:46 IST)
ఏపీ శాసనసభ బడ్జెట్‌ సమావేశాలు వాడివేడిగా సాగుతున్నాయి. సాగునీటి ప్రాజెక్టులపై జరిగిన చర్చ సందర్భంగా జలవనరుల శాఖ మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌ మాట్లాడుతూ, ప్రాజెక్టులపై కమిటీలు వేశామని, త్వరలో నివేదికలు వస్తాయని అన్నారు.

కమిటీ నివేదికలు వచ్చాక అన్ని విషయాలు బయటకొస్తాయని, అనంతరం రివర్స్‌ టెండరింగ్‌పై నిర్ణయం తీసుకుంటామన్నారు. ప్రాజెక్టులపై గత ప్రభుత్వం ప్రాజెక్టులపై అంచనాలను పెంచుకుంటూ పోయిందని మండిపడ్డారు.

పోలవరం ప్రాజెక్టును సీఎం జగన్‌ పూర్తి చేస్తారన్నారు. వైఎస్‌రాజశేఖర్‌ రెడ్డి హయాంలోని ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తామని సభాముఖంగా తెలియజేశారు.దీనిపై మరింత చదవండి :