శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 17 అక్టోబరు 2022 (09:46 IST)

జనసేన రాజకీయ పార్టీ కాదు.. అందుకే చిల్లరగాళ్లున్నారు.. : మంత్రి బొత్స

botsa
జనసేన పార్టీపైనా, ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌పైనా ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ వీరావేశంతో రెచ్చిపోయారు. అస్సలు ఆయన దృష్టిలో జనసేన ఒక రాజకీయ పార్టీనే కాదన్నారు. పైగా, అది ఒక సెలెబ్రిటీ సంస్థ, అందువల్ల ఆ పార్టీలో చిల్లరగాళ్లు ఉండటం సహజమేనని చెప్పారు. 
 
విశాఖ జిల్లా పర్యటనకు పవన్ కళ్యాణ్ బయలుదేరినప్పటి నుంచి ఏపీ మంత్రులు వీరావేశంతో రెచ్చిపోతున్నారు. పవన్ కళ్యాణ్ - ఏపీ మంత్రుల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ, విశాఖను పరిపాలనా రాజధానిగా చేస్తే నీకొచ్చిన నష్టంమేంటి? అంటూ పవన్‌ను మంత్రి బొత్స సూటిగా ప్రశ్నించారు. 
 
గతంలో గాజువాక నుంచి పోటీ చేసినపుడు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చెప్పిన మాటలు మరిచిపోయావా అంటూ గుర్తుచేశావు. ఇపుడు తెలుగుదేశం పార్టీకి వత్తాసు పలుకుతూ బురదచల్లే కార్యక్రమం చేస్తున్నావు ఉంటా బొత్స మండిపడ్డారు. అస్సలు నీకుగానీ, నీ పార్టీకి గానీ సిద్ధాంతాలు ఏమైనా ఉన్నాయా? అంటూ నిలదీశారు. 
 
'మంచికి మద్దతు ఇవ్వాలి, తప్పయితే తప్పు అని చెప్పాలి. ఇది బాధ్యత కలిగిన నాయకుడి లక్షణం. ప్రజాస్వామ్యంలో ఎవరికైనా ఇలాంటి వ్యక్తిత్వమే ఉండాలి. పవన్‌కు ఇలాంటివి ఏవీలేవు' అంటూ బొత్స విమర్శలు చేశారు. 
 
ఒక దశ దిశ లేని పార్టీ జనసేన అని, అది రాజకీయ పార్టీ కాదని, ఒక రాజకీయ పార్టీకి ఉండాల్సిన లక్షణాలేవీ లేవని వ్యాఖ్యానించారు. అది కేవలం ఒక సెలెబ్రిటీకి చెందిన సంస్థ అని, అందుకే చిల్లరగాళ్లు ఉంటారని పేర్కొన్నారు.