అవినీతి పార్టీలో వున్న రోజా అవినీతి గురించి మాట్లాడటమా? జవహర్ ప్రశ్న

బుధవారం, 20 డిశెంబరు 2017 (20:55 IST)

jawahar

అవినీతి పార్టీలో ఉన్న రోజా అవినీతి గురించి మాట్లాడడం సరియైనది కాదని, అవినీతిలో కూరుకపోయి, అవినీతిలో మునిగిపోయిన పార్టీలో పని చేస్తున్న రోజా అవినీతి గురించి ధర్నాలు చేసిన ప్రజలు నమ్మరనీ, గాడిదలు కాయాల్సి వస్తే రోజా తప్ప, మరెవరు కాయవలసిన అవసరం లేదని, నోరు సంభాళించుకోకపొతే ప్రజలే బుద్ది చెప్తారని మంత్రి జవహర్ అన్నారు.
 
ఇంకా ఆయన మాట్లాడుతూ.. 15-9-2017 నుండి  19-12-2017 వరకు మూడు దశల్లో 1,20,98,148 గంజాయి సాగు  మొక్కలను ధ్వంసం చేయడం జరిగింది. ఇందులో ఫారెస్ట్ ల్యాండ్ 630 హెక్టార్లు, గవర్నమెంట్ ల్యాండ్ 1698 హెక్టార్లు మొత్తంగా 2328 హెక్టార్లో సాగు ఉంది. మొత్తంగా సమాచారం ఉన్న మేరకు గంజాయి సాగు ధ్వంసం చేయడం జరిగిందన్నారు.
 
గంజాయి సాగును అరికట్టగలిగామనీ, సరఫరాను ఏవిధంగా అరికట్టాలనే 32 చెక్ పోస్టులను పెట్టి, వాటి ద్వారా గంజాయి  సరఫరాను నియత్రించడం జరుగుతుందన్నారు. PD యాక్ట్ పెట్టి ఎవరైతే గంజాయి సరఫరా చేస్తున్నారో వారి మీద కేసులు పెట్టి కఠినంగా శిక్షించడం జరుగుతుందన్నారు.



దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

కబ్జాను అడ్డుకున్న మహిళ దుస్తులిప్పేశారు... విశాఖలో దారుణం...

విశాఖపట్టణంలోని పెందుర్తిలో దారుణం జరిగింది. తన భూమిని కబ్జా చేసిన వారిని ఎదుర్కొన్న ...

news

జయలలిత మృతిపై మళ్లీ రసవత్తర చర్చ...

జయలలిత ఆసుపత్రిలో ఎలా ఉన్నారు? అపస్మారకస్థితిలో వెళ్లారా? అక్కడ ఆమెకు అసలు చికిత్స ...

news

పెందుర్తి మహిళను వివస్త్ర చేశారు.. మహిళా మంత్రులు గాడిదలు కాస్తున్నారా?

విశాఖలోని పెందుర్తిలో ఓ మహిళను భూకబ్జాదారులు వివస్త్రను చేశారు. కబ్జాను ప్రశ్నించిన ఓ ...

news

తల్లిని సరిగా చూసుకోవడం లేదనీ భార్యలను తగలబెట్టిన భర్త...

తన తల్లిని సరిగా చూసుకోవడం లేదన్న కోపంతో తన ఇద్దరు భార్యలను తగలబెట్టాడోభర్త. ఈ ఘటన ...