సోమవారం, 6 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : సోమవారం, 9 అక్టోబరు 2023 (08:24 IST)

ఏపీ మంత్రి గుమ్మన జయరాం ఇంట్లో విషాదం

saradamma
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్మిక శాఖామంత్రి గుమ్మన జయరాం ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. ఈ యేడాది ఫిబ్రవరి నెలలో ఆయన మరదలు చనిపోయారు. తాజాగా మంత్రి జయారం తల్లి భౌతికంగా దూరమయ్యారు. ఆమె అంత్యక్రియలను కూడా ఆదివారం పూర్తి చేశారు. 
 
మంత్రి జయరాం తల్లి పేరు శారదమ్మ. వయసు 79 సంవత్సరాలు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచారు. కొన్ని నెలల వ్యవధిలోనే రెండు మరణాలు సంభవించడంతో మంత్రి జయరాం కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.
 
కాగా, శారదమ్మ భౌతికకాయానికి పలువురు వైసీపీ నేతలు నివాళులు అర్పించారు. శారదమ్మ గతంలో గుమ్మనూరు గ్రామ సర్పంచిగా సేవలు అందించారు. మంత్రి జయరాం స్వగ్రామం ఆలూరు నియోజకవర్గం గుమ్మనూరులో శారదమ్మ అంత్యక్రియలు పూర్తి చేశారు.