శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: శనివారం, 28 మే 2022 (18:53 IST)

ఎన్టీఆర్ మరణానికి కారకులైనవారే ఆయన విగ్రహానికి దండలు వేసి పొగుడుతున్నారు: బాబుపై రోజా ఫైర్

rk roja
ఎన్టీఆర్ మరణానికి కారకులైనవారే ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి దండం పెడుతూ పొగుతున్నారంటూ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై ఏపీ మంత్రి రోజా వ్యాఖ్యానించారు.


టీడీపీ వ్యవస్థాపకుడు, మాజీ సీఎం ఎన్టీఆర్ శత జయంతి వేడుకల సందర్భంగా టీడీపీ జాతీయ అధ్యక్షుడు ఎన్.చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ గారిని పొగుడుతుంటే ఏమనాలో అర్థం కావడంలేదన్నారు. ఎన్టీ రామారావు మరణానికి చంద్రబాబే కారణమని అన్నారు.

 
శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడిన రోజా, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ మోహన్ రెడ్డిని విమర్శించడానికే నాయుడు, టీడీపీ నేతలు మహానాడును ఉపయోగించుకుంటున్నారని మండిపడ్డారు. 2019 ఎన్నికల్లో ఓడిపోవడానికి కారణాలను విశ్లేషించుకని తప్పులను సరిదిద్దుకోకుండా జగన్ మోహన్ రెడ్డిపై విమర్శించడమే పనిగా పెట్టుకున్నారన్నారు.

 
కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టినందుకు చంద్రబాబు సీఎంకు కృతజ్ఞతలు చెప్పకపోవడం దురదృష్టకరమని ఆమె అన్నారు.