Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

"దోమల ఉత్పత్తి నివారణ చట్టం"పై మంత్రులు కామినేని, లోకేష్ సమావేశం

శుక్రవారం, 30 జూన్ 2017 (18:08 IST)

Widgets Magazine
nara lokesh-kamineni

అమరావతి: "దోమల ఉత్పత్తి నివారణ చట్టం"పై శుక్రవారం ఏపీ సచివాలయంలో మంత్రులు కామినేని శ్రీనివాస్, నారా లోకేష్ సమావేశం నిర్వహించారు. దోమల ఉత్పత్తి నివారణ చట్టంపై విధివిధానాలను నిర్ణయించి, కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసి తదుపరి క్యాబినేట్లో ఈ చట్టంపై చర్చిస్తారు. ఈ చట్టంపై ముగ్గురు సభ్యులతో కూడిన "అప్పిలేట్ అధారిటీ"ని నియమించాలని ఈ సమావేశంలో మంత్రులు నిర్ణయించారు. 
 
ప్రస్తుతం రాష్ట్రంలో "దోమలపై దండయాత్ర"పై చేస్తున్న ప్రచారంలాగే "దోమల ఉత్పత్తి నివారణ చట్టం"పై ప్రజలకు అవగాహన కల్పించేలా పెద్దఎత్తున ప్రచారం చేయాలని సమావేశంలో నిర్ణయించారు. గ్రామాలు, పట్టణాలలో అపరిశుభ్రంగా నీరు నిల్వ ఉండటం, డ్రైయిన్స్ శుభ్రపరచకపోవడం, కొబ్బరి బోండాలు త్రాగి పడవేయడం, టైర్లు మరియు ఎయిర్‌కూలర్స్‌లో నీరు నిల్వ ఉండటంవల్ల దోమలు ఉత్పత్తి అవుతున్నాయన్నారు. 
 
దోమల వ్యాప్తి వల్ల వస్తున్న జ్వరాలు, మలేరియా, డెంగ్యూ వ్యాధి ప్రభావిత ప్రాంతాలను గుర్తించేందుకు ప్రభుత్వ ఆసుపత్రులలో రోజూ నమోదవుతున్న ఓపితో పాటు, ఈ ఔషది, స్వాస్ధ్య విద్యావాహిని కార్యక్రమాల ద్వారా గ్రామాలలో, మున్సిపల్ వార్డులలో ఎక్కువగా నమోదవుతున్న రోగాలను గుర్తించవచ్చన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులలో నమోదవుతున్న ఓపిని ఎప్పటికప్పుడు ఆన్లైన్ ద్వారా పరిశీలించడంవల్ల ఆ ప్రాంతంలో ఎక్కువగా నమోదు అవుతున్న వ్యాధులను గుర్తించి సత్వర చర్యలు చేపట్టేందుకు ఆస్కారం ఉంటుందన్నారు. 
 
ఆన్‌లైన్‌లో నమోదైన ఓపిని ఎప్పటికప్పుడు డ్యాష్ బోర్డు ద్వారా మంత్రి లోకేష్ పరిశీలించవచ్చు అన్నారు. దేశంలో వైద్య,ఆరోగ్య శాఖ పరిపాలనలో అత్యాధునిక, సాంకేతిక టెక్నాలజీని వాడుతున్న రాష్ట్రంగా ఏపీని గుర్తించి ప్రత్యేక అవార్డును రేపు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నట్లు మంత్రి లోకేష్‌కు కామినేని శ్రీనివాస్ ఈ సందర్భంగా తెలిపారు. ఏజెన్సీ ప్రాంతంలో నమోదవుతున్న జ్వరాలు, త్రాగునీటిపై మంత్రులు చర్చించారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

ప్లీనరీనా.. జబర్దస్త్ షో పెడుతున్నారా? ఐరన్ లెగ్ రోజా అక్కడే వుండాలి: వర్మ

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, సినీ నటి రోజాపై పీఠాపురం టీడీపీ ఎమ్మెల్యే వర్మ ...

news

వంద మంది అమ్మాయిలను బుట్టలో వేసుకున్నాడు.. డబ్బు, బంగారాన్నే కాదు.. శీలాన్ని కూడా?

ఒకరు కాదు ఇద్దరు కాదు.. ఏకంగా వంద మంది అమ్మాయిలను ప్రేమ పేరుతో నమ్మించి.. వారి వద్ద నగదు, ...

news

వారిద్దరికీ తేరుకోలేని షాకిచ్చిన చేప.. ఎలా? (Video)

ఇద్దరు మత్స్యుకారులకు ఓ పెద్ద చేప తేరుకోలేని షాకిచ్చింది. ఎంతో కష్టపడి వేటాడిన చేప తృటిలో ...

news

భర్తలేని సమయంలో ప్రియుడిని ఇంటికి పిలిచి రాసలీలలు.. రెడ్‌హ్యాండెడ్‌గా దొరికారు

భర్తలేని సమయంలో తన ప్రియుడిని ఇంటికి పిలిపించుకుని శృంగారంలో పాల్గొన్న మహిళను, ప్రియుడిని ...

Widgets Magazine