దుర్గమ్మ సేవలో కొత్త గవర్నర్

new governer
ఎం| Last Updated: మంగళవారం, 23 జులై 2019 (21:03 IST)
ఆంద్రప్రదేశ్ రాష్ట్ర నూతన గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ దంపతులు మంగళవారం సాయంత్రం 6.45 గం.లకు
దుర్గామల్లేశ్వర అమ్మవారి ఆలయమునకు విచ్చేయగా రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రివర్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు, రాష్ట్ర దేవాదాయ శాఖ కమీషనరు డా.మొవ్వ పద్మ, ఆలయ కార్యనిర్వహణాధికారి వలనుకొండ కోటేశ్వరమ్మ, ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు.


శ్రీ అమ్మవారి దర్శనానంతరము నూతన గవర్నర్ శ్రీ బిశ్వభూషణ్ హరిచందన్ దంపతుల వారికి ఆలయ స్థానాచార్యులు
విష్ణుభట్ల శివప్రసాద శర్మ మరియు వేదపండితులు వేద ఆశీర్వచనము పలికి, అమ్మవారి ప్రసాదములు, చిత్రపటమును అందజేసినారు.
దీనిపై మరింత చదవండి :