గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 9 ఏప్రియల్ 2021 (09:12 IST)

ఆంధ్రప్రదేశ్ పరిషత్‌ ఫైట్‌: రీ-పోలింగ్.. బ్యాలెట్‌ పత్రాలు తారుమారు కావడంతో..?

ఆంధ్రప్రదేశ్ పరిషత్‌ ఫైట్‌ 2021, ఏప్రిల్ 09వ తేదీ శుక్రవారం కూడా కొనసాగనుంది. కొన్ని కారణాలతో 3 జిల్లాల పరిధిలో ఆగిపోయిన చోట రీ-పోలింగ్‌ ప్రారంభం కానుంది. విజయనగరం జిల్లా సీతానగరం మండలం అంటిపేటలో రీ-పోలింగ్‌ జరగనుంది. 
 
అంటిపేట ఎంపీటీసీ స్థానానికి వైసీపీ అభ్యర్థిగా పోటీచేస్తున్న నిర్మల పేరుకు బదులు వేరే పేరును బ్యాలెట్‌పేపర్‌పై ముద్రించడంతో.. నిన్న పోలింగ్‌ నిలిపివేశారు. నెల్లూరు జిల్లా AS.పేట మండలం పొనుగుపాడులో బ్యాలెట్‌ బాక్సును ఓ పార్టీ ఏజెంట్‌ నీటితొట్టెలో వేయడంతో.. అక్కడ కూడా నిన్న పోలింగ్‌ నిలిచిపోయింది.
 
పశ్చిమగోదావరి జిల్లా ఇరగవరం పోలింగ్‌ కేంద్రంలో బ్యాలెట్‌ పత్రాలు తారుమారయ్యాయి. ఈ మూడు జిల్లాల్లో రీ పోలింగ్‌ జరగనుంది. గుంటూరు జిల్లా ఉయ్యందనలో రిగ్గింగ్‌పై కలెక్టర్‌ నివేదిక వచ్చిన తర్వాత ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది.
 
ఇక పరిషత్‌ ఎన్నికల్లో మందకొడిగా ఓటింగ్‌ జరిగింది. స్థానిక ఎన్నికల్లో ఎప్పుడూ దాదాపు 80 శాతం మేర జరిగే పోలింగ్‌.. ఈసారి కేవలం 60.91శాతంగానే నమోదైంది. ఉమ్మడి రాష్ట్రంలో 2014లో జరిగిన ఎన్నికల్లో 13 జిల్లాల్లో కలిపి 81శాతం పోలింగ్‌ రికార్డయింది. అప్పటి కంటే ఇప్పుడు ఏకంగా 20 శాతం మంది తక్కువగా ఓట్లేశారు.