శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 7 ఏప్రియల్ 2022 (07:30 IST)

నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గానికి ఆఖరు రోజు

apcabinet
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గం గురువారం రాజీనామా చేయనుంది. దీంతో నేటితో ఏపీ మంత్రివర్గం ముగియనుంది. గురువారం మధ్యాహ్నం 3 గంటలకు సీఎం జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగే మంత్రివర్గ సమావేశంలో మంత్రులందరిని ఆయన రాజీనామాలు కోరే అవకాశం ఉంది. 
 
ప్రస్తుతం ఉన్న మొత్తం 25 మంది మంత్రులతో రాజీనామా చేయించి, వారి స్థానంలో కొత్తగా 11 మందికి అవకాశం కల్పించనున్నారు. పాతమంత్రుల్లో నలుగురిని తిరిగి మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశం ఉంది. 
 
ప్రస్తుతం మంత్రులుగా ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆదిమూలపు సురేష్, గుమ్మనూరు జయరాం, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, సీదిరి అప్పలరాజులలో ముగ్గురు లేదంటే నలుగురుకి మళ్లీ మంత్రులుగా తీసుకునే అవకాశం ఉంది.