1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : ఆదివారం, 4 ఆగస్టు 2019 (14:06 IST)

నేను ఫిరాయింపులను ప్రోత్సహించను.. ఆ విషయంపై వెంకయ్యను ప్రశ్నించండి : తమ్మినేని సీతారాం

ఉపరాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్య నాయుడుపై ఏపీ సభాపతి తమ్మినేని సీతారాం సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజ్యసభలో టీడీపీ సభ్యులు బీజేపీలో చేరడాన్ని ఆయన ఎలా ప్రోత్సహిస్తారంటూ ప్రశ్నించారు. తాను అయితే, ఈ ఫిరాయింపులను ప్రోత్సహించేవాడిని కాదన్నారు. టీడీపీ సభ్యుల చేరికపై వెంకయ్య నాయుడినే ప్రశ్నించాలని మీడియాకు తమ్మినేని సీతారాం అన్నారు. 
 
దేశంలో స్పీకర్ వ్యవస్థ సంక్లిష్ట పరిస్థితుల్లో ఉందని ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. స్పీకర్ వ్యవస్థపై దేశవ్యాప్తంగా చర్చ జరగాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. శాసన, కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థలతో పాటు ఫోర్త్ ఎస్టేట్‌గా మీడియా ఉందన్నారు. మీడియా క్రియాశాలక పాత్ర పోషించాల్సిన పరిస్థితి వచ్చిందిన్నారు. వ్యవస్థలను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందన్నారు. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, నాలుగు స్తంభాల్లాంటి వ్యవస్థల కంటే పౌరవ్యవస్థ అనే మరో శక్తివంతమైన వ్యవస్థ ఉందన్నారు. శాసన సభ అద్దం లాంటిదన్నారు. ఇక్కడ చెప్పేవే ప్రజలకు ప్రతిభింబిస్తుందన్నారు. బిల్లులపై శాసనసభలో సమగ్ర చర్చ జరిగితేనే అన్ని అంశాలు ప్రజల్లోకి వెళ్తాయన్నారు. నాపై ఎవరి ఒత్తిళ్లు లేకపోవడం వల్లే స్వతంత్ర నిర్ణయాలు తీసుకుంటున్నాను అని చెప్పారు. చట్టాలు చేసే మేమే వెళ్లి అధికారులపై ఆధిపత్యం చేయడం దురదుష్టకరమన్నారు. 
 
ఒక వ్యవస్థలో మరో వ్యవస్థ జోక్యం చేసుకోకూడదని రాజ్యాంగం చెబుతోంది, స్పీకర్‌కు విచక్షణాధికారాలు ఉంటాయి
ని తెలిపారు. ఒక వ్యవస్థలో మరో వ్యవస్థ జోక్యం చేసుకోకపోతేనే ఆశించిన మంచి ఫలితాలు వస్తాయన్నారు. వ్యవస్థలు దిగజారిపోతుంటే పాత్రికేయులు వాటిని వెలుగులోకి తీసుకురావాలని చెప్పారు. వ్యవస్థలు నాలుగు గుర్రాలపై పరుగులు తీస్తుంటుందన్నారు. 
 
పార్లమెంటరీలో కనిపించని ఐదో గుర్రమే మంచి పౌరుడు అని చెప్పారు. పౌరులు మిగిలిన నాలుగు వ్యవస్థలను నిశితంగా పరిశీస్తుంటారని చెప్పారు. రాజ్యాంగ వ్యవస్థలను మనం అంతా కాపాడుకోవాలన్నారు. అందరూ అనుకుని ముందుకు వెళ్తే మంచి మంచి ఫలితాలు వస్తాయని చెప్పారు. రాజ్యాంగ వ్యవస్థ పరిరక్షిస్తే ప్రజలకు ఖచ్చితంగా మంచి జరుగుతుందని చెప్పారు. ప్రజలు ప్రతి ఒక్క అంశాన్నీ పూర్తిగా పరిశీలిస్తున్నారు.
 
పార్టీ ఫిరాయింపులపై చట్టసభల్లో సమగ్రంగా చర్చ జరగాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. శాసనసభలో 3 ఛానళ్లపై బ్యాన్ చేయడాన్ని నేను సమర్థించనని చెప్పారు. శాసన సభ జరుగుతున్నప్పుడు మీడియా పాయింట్ నుంచి లైవ్‌లు ఇవ్వకూడదని నిబంధన ఉందని గుర్తుచేశారు. భవిష్యత్తులో పునరావృతం కాకూడదనే తాత్కాలిక నిషేధం విధించినట్టు తెలిపారు. 
 
ఛానళ్ల యాజమాన్యాలు ఇచ్చిన వివరణను పరిశీలిస్తున్నామనీ, వీలైనంత త్వరలో సానుకూల నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. శాసన సభ నిబంధనలు మీడియా సహా అంతా పాటించాన్నదే నా ఉద్దేశమన్నారు. ఇందులో ఎలాంటి దురుద్దేశాలు లేవన్నారు. ముగ్గురు తెదేపా రాజ్యసభ సభ్యులను భాజపాలో చేర్చుకోవడంపై ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడినే అడగాలన్నారు. 
 
అనైతికతను ప్రోత్సహించవచ్చా అని మీడియా ప్రతినిధులే వెంకయ్యనాయుడినే ప్రశ్నించాలన్నారు. విలువలతో కూడిన రాజకీయాలు కావాలనేది నా అభిప్రాయని చెప్పుకొచ్చారు. ప్రజలు అన్నింటినీ గౌరవిస్తున్నారనీ, రాజ్యసభలో తెదేపా సభ్యులను చేర్చుకోవడం తప్పేనన్నారు. రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిన వారే అలా చేయకపోతే ఎలా అని ప్రశ్నించారు. అనైతికను ప్రోత్సహించడం సరికాదన్నారు. నేనైతే నేనెప్పుడు ఫిరాయింపులను ప్రోత్సహించనని స్పష్టంచేశారు. 
 
శాసనసభ హూందా తనాన్ని పెంచేలా వ్యవహరిస్తానని, సభను హూందాగా, గౌరవంగా నడపడంలో అందరి సహకారం కావాలన్నారు. సభలో తెదేపాలో 23 మందే ఉన్నారని ఎప్పుడూ అనుకోలేదు తెదేపాకు సభలో ఎక్కువగా అవకాశం ఇచ్చినట్టు చెప్పుకొచ్చారు. ప్రజానాయకుడు ఎప్పుడూ మైనం పూతలా మారిపోతూ ఉండాలన్నారు. రాజకీయనాయకుడిగా ఉన్నప్పుడు దూకుడుగా ఉన్న నేను కంట్రోల్ చేసుకుంటున్నా అవసరాన్ని బట్టి లౌక్యంగా వ్యవహరించాల్సి ఉంటుందన్నారు. 
 
శాసనసభలో ప్రతిపక్ష తెదేపా గొంతునొక్కే ఉద్దేశం నాకు లేదన్నారు. చంద్రబాబు సహా తెదేపా నేతలు అలాభావిస్తే ప్రజాభిప్రాయం తీసుకుందామన్నారు. గత శాసన సభలో జరిగిన ప్రొసీడింగ్స్‌ను ఇటీవల జరిగిన ప్రొసీడింగ్స్‌ను పరిశీలించాలన్నారు. గతంలో జరిగిన విధానానికి ఇప్పుడు సభ పూర్తిభిన్నంగా జరిగిందన్నారు. తప్పులు చేయకూడదనే నేను ప్రయత్నిస్తున్నాను, నేనెప్పుడూ బేషజాలకు పోననీ, నాలో లోపాలు ఉంటే సరిదిద్దుకునేందుకు సిద్ధంగా ఉన్నాననీ, ఉత్తమ స్పీకరుగా పేరు సంపాదించాలనేదే నా లక్ష్యమని సభాపతి తమ్మినేని సీతారాం చెప్పుకొచ్చారు.