గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 5 జూన్ 2021 (10:08 IST)

విశాఖ యువకుడు ఘనత.. ఎవరెస్ట్ శిఖరంపై అడుగు

విశాఖపట్టణంకు చెందిన ఓ యువకుడు అరుదైన ఘనతను సాధించాడు. ఎవరెస్ట్ శిఖరం ఎక్కి కూర్చొన్నాడు. అతని పేరు భూపతి రాజు అనిమిష్ వర్మ. ఈ యువకుడు అతమ సత్తాను చూపుతూ ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించాడు. 
 
చాలా మంది పర్వతారోహకులు సైతం ఎవరెస్ట్ ఎక్కనిదే తమ జీవితానికి సార్థకత ఉండదని భావిస్తుంటారు. ఇంతటి సమున్నత పర్వతాన్ని తెలుగు యువకుడు అధిరోహించాడు. ఎవరెస్ట్ అధిరోహణలో అనిమిష్‌కు అడ్వెంచర్ స్పోర్ట్స్ అకాడమీ సాయపడింది. 
 
28 ఏళ్ల అనిమిష్ వర్మ స్వస్థలం విశాఖ. ఈ నెల ఒకటో తేదీన ఎవరెస్ట్ శిఖరాగ్రం కాలుమోపి తన జీవితకాల స్వప్నాని నెరవేర్చుకున్నాడు. అనిమిష్ 2017 నుంచి పర్వతారోహణపై ఆసక్తితో కఠిన శిక్షణ పొందాడు. ప్రత్యేక శిక్షణలో భాగంగా లఢక్‌లో మంచు పర్వతాన్ని అధిరోహించారు. 
 
ఆ సమయంలో ఉష్ణోగ్రతలు మైనస్ 40 డిగ్రీలకు పడిపోయినా అనిమిష్ వెనుకంజ వేయలేదు. అంతేకాదు, గతేడాది ఆఫ్రికాలోని కిలిమంజారో, సౌత్ అమెరికాలోని అకాంగువా పర్వతాలను కూడా అధిరోహించాడు. ఎంబీఏ చదివిన అనిమిష్‌కు మార్షల్ ఆర్ట్స్‌లోనూ నైపుణ్యం ఉంది. వరల్డ్ కిక్ బాక్సింగ్, కరాటే పోటీల్లో అనేక పతకాలు సొంతం చేసుకుని సత్తా చాటాడు.