మంగళవారం, 7 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 29 మార్చి 2023 (11:46 IST)

ఏపీ గ్రూప్-1 మెయిన్స్ వాయిదా.. కారణం అదే

appsc exam
ఏపీ గ్రూప్-1 మెయిన్స్ వాయిదా పడ్డాయి. యూపీఎస్సీ సివిల్స్ ఇంటర్వ్యూల నేపథ్యంలో గ్రూప్-1 మెయిన్స్ వాయిదా వేశారు. ఏప్రిల్ 23 నుంచి 29 వరకు జరగాల్సిన గ్రూప్-1 మెయిన్స్‌ను జూన్ తొలి వారానికి వాయిదా వేసింది. ఇందులో భాగంగా జూన్ 3వ తేదీ నుంచి 9వ తేదీ వరకు ఈ పరీక్షలు జరుగుతాయని ఏపీపీఎస్సీ ప్రకటించింది. 
 
2022 సివిల్స్ ఫేజ్-3 ఇంటర్వ్యూలు.. ఏప్రిల్ 24 నుంచి మే 18 వరకు జరగనున్నాయి. ఈ షెడ్యూల్ ను యూపీఎస్సీ తాజాగా ప్రకటించడంతో గ్రూప్-1 మెయిన్స్‌ను వాయిదా వేయాల్సి వచ్చిందని ఏపీపీఎస్పీ తెలిపింది. అభ్యర్థులు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ఈ నిర్ణయానికి వచ్చినట్లు ఏపీపీఎస్పీ వెల్లడించింది.