బుధవారం, 20 ఆగస్టు 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 26 జులై 2025 (08:45 IST)

Cardiac Arrest: గుండెపోటు స్టీరింగ్‌పైనే కుప్పకూలిన ఏపీఎస్సార్టీసీ డ్రైవర్.. ఆ తర్వాత ఏమైందంటే?

Bus Driver
Bus Driver
నెల్లూరు జిల్లా కావలి నుండి బెంగళూరుకు వెళ్తున్న ఏపీఎస్సార్టీసీ బస్సు డ్రైవర్ గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయారు. అన్నమయ్య జిల్లా రాయచోటి శివార్లకు చేరుకున్నప్పుడు డ్రైవర్ గుండెపోటుకు గురయ్యాడు. వెంటనే కావలి డిపోకు చెందిన 50 ఏళ్ల డ్రైవర్ రసూల్ బస్సును రోడ్డు పక్కనే ఆపేశాడు. స్టీరింగ్‌పై కుప్పకూలిపోయాడు. 
 
దీంతో పెను ప్రమాదం తప్పింది. ఇంకా ప్రయాణికులు అంబులెన్స్ సర్వీసులకు సమాచారం అందించడంతో, రసూల్‌ను రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ అతనిని పరిశోధించిన వైద్యులు అతను మరణించినట్లు ప్రకటించారు. 
 
ఆపై ప్రయాణికులు బెంగళూరు చేరుకోవడానికి అధికారులు ప్రత్యామ్నాయ బస్సును ఏర్పాటు చేశారు. ఈ ఘటనపై ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ విశ్వనాథ్ రెడ్డి కేసు నమోదు చేశారు.