వైద్య పరీక్షలు పూర్తి.. మెడికల్ కేర్‌లో ఉన్న రఘురామరాజు  
                                       
                  
                  				  ఏపీలోని అధికార వైకాపాకు చెందిన నర్సాపురం రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజుకు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సికింద్రాబాద్‌లోని ఆర్మీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు పూర్తి చేశారు. ఈ మేరకు ఆసుపత్రి వైద్యులు ప్రకటించారు. 
				  											
																													
									  
	 
	తెలంగాణ హైకోర్టు నియమించిన జ్యుడీషియల్ అధికారి ఆధ్వర్యంలో ముగ్గురు వైద్యుల బృందం పరీక్షలను నిర్వహించిందని చెప్పారు. ఈ పరీక్షల ప్రక్రియను వీడియో తీశామని తెలిపారు. ప్రస్తుతం రఘురాజు ఆసుపత్రిలో మెడికల్ కేర్‌లో ఉన్నారని చెప్పారు.
				  
	 
	అయితే, సుప్రీంకోర్టు తదుపరి ఆదేశాలను ఇచ్చేంత వరకు ఆయన ఇక్కడే ఉంటారని వెల్లడించారు. కరోనా ప్రొటోకాల్‌ను కూడా పాటిస్తున్నామని చెప్పారు. మరోవైపు డాక్టర్లు ఇచ్చే రిపోర్టును సుప్రీంకోర్టుకు తెలంగాణ హైకోర్టు సీల్డ్ కవర్‌లో సమర్పించనుంది. 
				  																								
	 
 
 
  
	
	
																		
									  
	 
	రఘురాజు ఆసుపత్రిలో ఉన్న సమయాన్ని కూడా జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నట్టుగానే పరిగణించనున్నారు. ఇంకోవైపు, ఆయనను చూసేందుకు ఆర్మీ అధికారులు ఎవరినీ అనుమతించడం లేదు. అయితే, రఘురామరాజు కుడికాలు బాగా వాచిపోయివున్నట్టు వార్తలు వస్తున్నాయి.