చింతామణి నాటకాన్ని నిషేదించారు... థ్యాంక్స్ సీఎం సార్...
చింతామణి నాటకాన్ని నిషేదించారు... థ్యాంక్స్ సీఎం సార్... అంటూ ఆర్య వైశ్య ప్రతినిధులు ఏపీ సీఎంని కలిసి తమ సంఘీభావాన్ని ప్రకటించారు. సచివాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఆర్యవైశ్య సంఘం ప్రతినిధులు ఈ సందర్బంగా మాట్లాడుతూ, వైశ్యులను కించపరిచే విధంగా ఉన్న చింతామణి నాటక ప్రదర్శనను నిషేదించాలన్న ఆర్యవైశ్యుల విజ్ఞప్తి మేరకు ఇటీవల ఏపీ ప్రభుత్వం దీనిని నిషేదించిందని చెప్పారు.
సీఎంని కలిసిన వారిలో దేవాదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, ఏపీ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు ముక్కాల ద్వారకానాథ్, ఆర్యవైశ్య వెల్ఫేర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ కుప్పం ప్రసాద్, ఆర్టీఐ కమిషనర్ రేపాల శ్రీనివాసరావు తదితరులున్నారు. అయితే, ఇటీవల వైసీపీ నేత సుబ్బారావుపై మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అనుచరులు దాడి చేసిన ఘటన వల్ల ఆర్య వైశ్యుల్లో వచ్చిన చెడ్డ పేరు తొలిగించేందుకు ఈ నిర్నయం తీసుకున్నారనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.