మంగళవారం, 5 ఆగస్టు 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 4 జులై 2020 (10:01 IST)

కరోనాకు మెడిసిన్ కనుగొనేలా ఆశీర్వదించమని కోరా: విజయసాయిరెడ్డి

త్వరలో కరోనా వైరస్ కు మెడిసిన్ కనుగొనేలా ఆశీర్వదించాలని శ్రీవారిని కోరినట్లు వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి తెలిపారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలనలో ప్రజలు సుభిక్షంగా, సంతోషంగా ఉండాలని మనస్పూర్తిగా కోరుకున్నానని, శ్రీవారిని ప్రార్దించానని తెలిపారు.
 
ఎందరో ప్రజలు కరోనా మహమ్మారి భారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చాలామంది భక్తులు ఈ వైరస్ కారణంగా శ్రీవారిని దర్శించుకోలేకపోతున్నారని, అయినప్పటికీ టీటీడీ చైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి చక్కటి ప్రణాళికతో భక్తులకు శ్రీవారి దర్శన భాగ్యాన్ని కల్పించడం అభినందనీయమని కొనియాడారు. 
 
తిరుమల శ్రీవారిని శనివారం ఉదయం విజయసాయి రెడ్డి, ప్రభుత్వ విప్, చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, తెలుగు అకాడమీ చైర్మెన్ లక్ష్మి పార్వతి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి తలనీలాలు సమర్పించి మొక్కు తీర్చుకున్నారు.