శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 6 అక్టోబరు 2015 (12:34 IST)

అమరావతికి ఆ ముహూర్తం సరికాదు.. అదే రోజు 11.32 నిమిషాలైతే మేలు!

నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణంలో భాగంగా శంకుస్థాపన చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన ముహూర్తంపై సర్వత్రా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇప్పటికే వాస్తు, జ్యోతిష్య నిపుణులు అమరావతి శంకుస్థాపనకు ఈ నెల 22న మధ్యాహ్నం 12.45 నిమిషాలకు శంకుస్థాపన చేయడం అంత మంచిది కాదని చెప్పేశారు. తాజాగా అదే ముహూర్తంపై సంస్కృత లెక్చరర్ ఒకరు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. 
 
ప్రభుత్వం ఖరారు చేసిన ముహూర్తం సరైనది కాదని పీహెచ్ హెచ్‌ఈ పురుషోత్తం అనే సంస్కృత లెక్చరర్ వాదిస్తున్నారు. ఈ నెల 22న మకర లగ్నంలో 12.35 నుంచి 12.45 గంటల మధ్య శంకుస్థాపన చేస్తే రాజధాని నిర్మాణానికి, సీఎం చంద్రబాబుకు ఆటంకాలు ఎదురవుతాయని పేర్కొన్నారు. అదే రోజు ధనుర్ లగ్నంలో 11.32 నిమిషాలకు శంకుస్థాపన కార్యక్రమం నిర్వహిస్తే కొంతమేలుగా ఉంటుందని పురుషోత్తం అంటున్నారు.
 
మరి జ్యోతిష్యులు, లెక్చరర్లు, వాస్తు పండితులు వద్దంటున్న ముహూర్తంలోనే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అమరావతి నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారా? లేకుంటే.. నిపుణుల  సలహాలను స్వీకరిస్తారా? అనేది తెలియాలంటే వేచి చూడాల్సిందే.