గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Modified: గురువారం, 7 జనవరి 2021 (22:22 IST)

ఆలయాలపై దాడులు, టిటిడి ఛైర్మన్ సంచలన వ్యాఖ్యలు, ఏమన్నారంటే?

రాజకీయ ప్రేరణతో రాష్ట్రంలో ఆలయాలపై దాడులు జరుగుతున్నాయని టిటిడి ఛైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి తెలిపారు. తిరుపతిలో జరిగిన పోలీస్ డ్యూటీ మీట్ ముగింపు సభలో టిటిడి ఛైర్మన్ మాట్లాడారు. దురదృష్ట కుట్రల వెనుక ఏ పార్టీ వారున్నా నిర్థాక్షిణ్యంగా అణచివేయాలన్నారు. శాంతిభద్రతలను కాపాడే విషయంలో ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి పోలీసులు పూర్తి స్వేచ్ఛనిచ్చారన్నారు. 
 
ఆలయాలు, మసీదులు, చర్చిల్లో 35 వేల ఆధునిక సిసి కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. అలాగే అవసరమైన చోట మరిన్ని సిసి కెమెరాలు ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం సిద్థంగా ఉందన్నారు. ప్రభుత్వం ఏర్పడిన తరువాత 18 అవార్డులు రావడం ప్రభుత్వ, పోలీసు శాఖల పనితీరుకు నిదర్సనమని చెప్పారు.