మంగళవారం, 21 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 17 నవంబరు 2024 (10:19 IST)

విద్యార్థిని ఫిర్యాదుతో కొడాలి నానిపై కేసు నమోదు...

kodali nani
గత వైకాపా ప్రభుత్వంలో అధికారం అండ చూసుకుని ప్రజాప్రతినిధులు రెచ్చిపోయారు. నోటికి ఇష్టమొచ్చిన భాషను ఉపయోగిస్తూ విపక్ష నేతలను బూతులు తిట్టారు. కిందిస్థాయి కార్యకర్త నుంచి ఎంపీ వరకు అసభ్య పదజాలంతో రెచ్చిపోయారు. ఇపుడు రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో అలాంటి బూతు రాయుళ్ల నోటికి తాళం పడుతుంది. వైకాపా ప్రభుత్వంలో అసభ్య పదజాలంతో రెచ్చిపోయిన వారిపై కేసులు నమోదు చేస్తూ అరెస్టులు చేస్తున్నారు. 
 
తాజాగా, వైకాపా నేత, మాజీ మంత్రి కొడాలిపై కేసు నమోదైంది. వైజాగ్‌  ఏయూలోని న్యాయ కాలేజీకి చెందిన అంజనప్రియ అనే విద్యార్థిని శనివారం రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఒక స్త్రీగా కొడాలి నాని తిట్ల పురణానాన్ని సహించలేకపోయినట్టు పోలీసులకు ఆమె ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆమె ఫిర్యాదు మేరకు విశాఖపట్టణం మూడో పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. 
 
మరోవైపు, ఏపీలో వైకాపా సోషల్ మీడియా కన్వీనర్ల అరెస్టులు కొనసాగుతున్నాయి. వైకాపా ప్రభుత్వ హయాంలో విపక్ష టీడీపీ నేతలను, వారి కుటుంబ సభ్యులను టార్గెట్ చేస్తూ వ్యక్తిగత దూషలకు దిగడంతో పాటు అసభ్యకర పోస్టులు పెట్టినవారిపై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టులు చేస్తున్నారు. ఈ క్రమంలో కడప జిల్లా వ్యాప్తంగా వైకాపాకు చెందిన సోషల్ మీడియా కన్వీనర్లకు వైకాపా 41ఏ కింద నోటీసులు జారీ చేసింది. నోటీసులు అందినవారి జాబితాలో కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి పీఏ రాఘవరెడ్డి కూడా ఉన్నారు. నోటీసులు అందుకున్నవారు విచారణకు హాజరుకావాలని పోలీసులు కోరారు.