గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కె
Last Modified: విజయవాడ , గురువారం, 30 సెప్టెంబరు 2021 (13:21 IST)

ఆయుర్వేదం ఆనందయ్య బిజీ బిజీ.. అఖిల భారత యాదవ సమాఖ్య నాయకులతో సమీక్షలు

కరోనా సమయంలో ఆయుర్వేద మందుతో దేశం మొత్తాన్ని తన వైపు తిప్పుకున్ననెల్లూరు ఆనందయ్య మరో సంచలనానికి సిద్ధమయ్యారు. బీసీల కోసం పొలిటికల్ పార్టీ పెట్టబోతున్నట్లు ప్రకటించిన వెంటనే రంగంలోకి దిగిపోయారు. రాజకీయ పార్టీ ఏర్పాటు పనుల్లో ఆనందయ్య బిజీ బిజీగా మారిపోయాడు. నెల్లూరు జిల్లాల్లో అఖిల భారత యాదవ సమాఖ్య సమీక్షలు ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతున్నారు. నేడు ప్రకాశం, నెల్లూరు జిల్లాలో యాదవ ప్రతినిధులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు.
 
అందరితో చర్చించిన తర్వత బీసీల కోసం రాజకీయ పార్టీ ఏర్పాటుపై నిర్ణయం తీసుకోనున్నారు. త్వరలోనే పార్టీపై ప్రకటన చేసేందుకు సిద్ధమవుతున్నారు. అదే రోజు పార్టీ పేరు, జెండా, అజెండాను ఆవిష్కరించనున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే ఈ ఏర్పాట్లలో ఓ టీమ్ ఇదే పనిలో ఉన్నట్లుగా సమాచారం.