1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 2 అక్టోబరు 2018 (12:08 IST)

శ్రీలంకలో పోటీ చేస్తానంటున్న హాస్య నటుడు బాబూ మోహన్

సినీ హాస్య నటుడు బాబూ మోహన్ మరోమారు పార్టీ మారారు. తొలుత తెలుగుదేశం పార్టీలో చేరి మంత్రిగా ఉన్నారు. రాష్ట్ర విభజన తర్వాత ఆయన తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరారు. తెలంగాణ రాష్ట్రంలో తెరాస అధికారంలో ఉన్నప్పట

సినీ హాస్య నటుడు బాబూ మోహన్ మరోమారు పార్టీ మారారు. తొలుత తెలుగుదేశం పార్టీలో చేరి మంత్రిగా ఉన్నారు. రాష్ట్ర విభజన తర్వాత ఆయన తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరారు. తెలంగాణ రాష్ట్రంలో తెరాస అధికారంలో ఉన్నప్పటికీ ఆయన మాత్రం అధికారానికి దూరంగా ఉన్నారు. దీంతో విసిగిపోయిన బాబూ మోహన్ ఇపుడు పార్టీ మారారు. ఆయన కారు దిగి కాషాయం కండువా కప్పుకున్నారు. ఇటీవలే ఢిల్లీకి వెళ్లి ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరారు. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీకి జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో బాబూ మోహన్‌కు టిక్కెట్ ఇచ్చేందుకు కేసీఆర్ నిరాకరించారు. దీంతో ఆయన బీజేపీలో చేరిపోయారు.
 
ఆ తర్వాత ఆయన విలేకరులతో మాట్లాడుతూ, వచ్చే ఎన్నికల్లో బీజేపీ అధిష్టానం ఎక్కడి నుంచి పోటీ చేయమంటే అక్కడి నుంచి పోటీ చేస్తానని, ఒక వేళ శ్రీలంకలో పోటీ చేయాలంటే అక్కడ కూడా పోటీ చేస్తానని స్పష్టం చేశారు. తాను బీజేపీలో చేరడానికి గల కారణాలను రెండు, మూడు రోజుల్లో వివరంగా తెలియజేస్తానని తెలిపారు. శ్రీలంకలో తనకు చాలా మంది అభిమానులు ఉన్నారని, తన ఫొటో పెట్టుకొని చాలామంది మున్సిపల్‌ ఎన్నికల్లో గెలుపొందారని ఆయన గుర్తు చేశారు.