మంగళవారం, 21 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , మంగళవారం, 2 నవంబరు 2021 (14:06 IST)

జగన్‌ పాలనకు ఈ విజయం నిదర్శనం: బ‌ద్వేల్ ఎమ్మెల్యే దాసరి సుధ

బ‌ద్వేలు ఉప ఎన్నికలో భారీ మెజార్టీ అందించిన ప్రజలకు, ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశమిచ్చిన సీఎం జగన్‌కు వైకాపా అభ్యర్థి దాసరి సుధ ధన్యవాదాలు తెలిపారు. సీఎం జగన్‌ పాలనకు ఈ ఫలితం నిదర్శనమని చెప్పారు. ఉప ఎన్నికలో విజయం సాధించిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. గతంలో తన భర్తకు వచ్చిన మెజార్టీ కంటే, ఈసారి రెట్టింపు ఆధిక్యాన్నిఇచ్చారన్నారు. తన గెలుపునకు సహకరించిన పార్టీ నాయకులకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. 

 
అభిమానుల జ‌య‌జ‌య‌ద్వానాల మ‌ధ్య ఎమ్మెల్యే ధ్రువీకరణపత్రం అందుకున్న దాసరి సుధ వైసీపీ కార్య‌కర్త‌ల‌కు త‌న కృత‌జ్న‌త‌లు తెలిపారు. బద్వేలు ఉప ఎన్నికలో వైకాపా అభ్యర్థి దాసరి సుధ ఘన విజయం సాధించారు. ఈ మేరకు అధికారులు ఆమెకు ఎమ్మెల్యేగా గెలుపొందినట్లు ధ్రువీకరణ పత్రం అందజేశారు. త‌న విజ‌యం ఏపీ సీఎం జ‌గ‌న్మ‌హ‌న్ రెడ్డి పాల‌న‌ను ప్ర‌తిబింబిస్తుంద‌ని ఎమ్మెల్యే సుధ చెప్పారు. జ‌గ‌న‌న్న సంక్షేమ ప‌థ‌కాల‌కు, పాల‌నకు ప్ర‌జ‌లు గ్రీన్ సిగ్న‌ల్ మ‌రోసారి ఇచ్చిన‌ట్ల‌యింద‌ని ఆమె పేర్కొన్నారు.