శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By PNR
Last Updated : సోమవారం, 1 సెప్టెంబరు 2014 (13:10 IST)

చెన్నైలో బాపు భౌతికకాయానికి హీరో బాలకృష్ణ నివాళులు ...

చెన్నైలో అనారోగ్యం కారణంగా కన్నుమూసిన ప్రముఖ దర్శకుడు బాపు భౌతికదేహానికి ప్రముఖ హీరో, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ సోమవారం నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బాపు ఇకలేరన్న విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నట్టు చెప్పారు. 
 
బాపు సినిమా, చిత్రకళ తెలుగుదనానికి ప్రతీక అని కొనియాడారు. బాపు బొమ్మలేని తెలుగు లోగిలి కనించిదని బాలయ్య చెప్పారు. బాపులాంటి వారికి మరణం లేదు... కలకాలం నిలిచిపోతారని పేర్కొన్నారు. తెలుగు జాతిలోనే బాపు మళ్లీ పుట్టాలని బాలకృష్ణ ఆకాంక్షించారు. సోమవారం ఉదయం బాపు భౌతికకాయాన్ని బాలకృష్ణ సందర్శించి కన్నీటిపర్యంతమయ్యారు.