శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 15 సెప్టెంబరు 2016 (11:00 IST)

బాలాపూర్ లడ్డూ ధర.. ఆల్‌టైం రికార్డు.. ధర రూ.14.65 లక్షలు

హైదరాబాద్ బాలాపూర్ లడ్డూ ధర రికార్డు స్థాయిలో పలికింది. ఈ ధర ఆల్‌టైమ్ రికార్డు కావడం గమనార్హం. గురువారం వరుణుడి చిరు జల్లుల మధ్య బాలాపూర్ గణేషుడి చేతిలోని ప్రసాదం వేలం పూర్తయింది. వేలం పాటలో లడ్డూను ర

హైదరాబాద్ బాలాపూర్ లడ్డూ ధర రికార్డు స్థాయిలో పలికింది. ఈ ధర ఆల్‌టైమ్ రికార్డు కావడం గమనార్హం. గురువారం వరుణుడి చిరు జల్లుల మధ్య బాలాపూర్ గణేషుడి చేతిలోని ప్రసాదం వేలం పూర్తయింది. వేలం పాటలో లడ్డూను రూ.14.65 లక్షలకు స్కైలాబ్ రెడ్డి అనే భక్తుడు దక్కించుకున్నారు. 
 
బాలాపూర్ గణేష్ లడ్డూ వేలంలో ఇది ఆల్ టైం రికార్డు. గురువారం బాలాపూర్ వీధుల్లో ఊరేగింపు అనంతరం లడ్డూ వేలాన్ని నిర్వహించారు. నలుగురు స్థానికేతరులు సహా మొత్తం 25 మంది లడ్డూను వేలం పాడేందుకు పోటీ పడ్డారు. వీరిలో పలువురు రియల్ ఎస్టేట్ ప్రముఖులు, రాజకీయ నేతలు కూడా ఉన్నారు. గత సంవత్సరం రూ. 10.32 లక్షలకు లడ్డూను ఓ భక్తుడు పాడుకున్న సంగతి తెలిసిందే.