బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 23 సెప్టెంబరు 2024 (09:59 IST)

కల్తీ పాపానికి పాల్పడినవారు రక్తం కక్కుకుని చావాలి : భూమన కరుణాకర్ రెడ్డి (Video)

bhumana karunakar reddy
కోట్లాది మంది భక్తులు పరమ పవిత్రంగా భావించే శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగివుంటే బాధ్యులు రక్తం కక్కుకుని చనిపోవాలంటూ తిరుమల తిరుపతి దేవస్థానం పూర్వ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. ఈ కల్తీ లడ్డూ వ్యవహారంపై ఆయన ఆదివారం విలేకరులతో మాట్లాడారు. తిరుమల లడ్డూ కల్తీ జరిగివుంటే ఈ మహా పాపానికి పాల్పడినవారు రక్తం కక్కుకుని చావాలి. శ్రీవారిని అదే కోరుకుంటున్నా అన్నారు. 
 
రాష్ట్రంలో వైకాపా, తమ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డిని రాజకీయంగా శాశ్వతంగా కనుమరుగు చేయడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నీచ రాజకీయాలకు ఒడిగడుతున్నారని, ఇందుకోసం సాక్షాత్తూ ఆ శ్రీవారిని పావుగా వాడుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు  ఆరోపణలపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జోక్యం చేసుకుని సీబీఐ లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.