సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 10 జనవరి 2024 (16:36 IST)

సీఎం జగన్‌తో భేటీ అయిన కేశినేని నాని, కుమార్తె కేశినేని శ్వేత

kesineni nani
తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేయనున్నట్టు కేశినేని నాని ప్రకటించిన సంగతి తెలిసిందే. కేశినేని నాని కుమార్తె కేశినేని శ్వేత కూడా కార్పొరేటర్ పదవికి రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో సీఎం జగన్‌ను కేశినేని నాని కలవడం ఏపీ రాజకీయవర్గాల్లో ఆసక్తికరంగా మారింది. 
 
ఏపీ సీఎం జగన్ రెడ్డితో బుధవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎంను ఆయన కలిశారు. విజయవాడ తూర్పు నియోజకవర్గ ఇంచార్జి దేవినేని అవినాష్, అయోధ్య రామిరెడ్డి, మాజీ మంత్రి వెల్లంపల్లితో పాటు కేశినేని నాని క్యాంపు కార్యాలయానికి వచ్చారు.
 
కేశినేని నాని కుమార్తె కేశినేని శ్వేత ఇద్దరూ ఏపీ సీఎం, వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌తో బుధవారం మధ్యాహ్నం తండ్రీ, కూతురు ఇద్దరు ఏపీ సీఎం జగన్‌తో తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో భేటి అయ్యారు. వీరి కలయిక విజయవాడ రాజకీయాల్లో పెను మార్పులకు దారి తీస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.