గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 10 జనవరి 2024 (15:14 IST)

మూడు కేసుల్లో చంద్రబాబుకు ముందస్తు బెయిల్

Chandra Babu
టీడీపీ అధినేత చంద్రబాబుపై నమోదైన మద్యం అనుమతుల కేసు, ఇన్నర్ రింగ్ రోడ్డు (ఐఆర్ఆర్) కేసు, ఇసుక పాలసీ కేసుల్లో ఏపీ హైకోర్టు ముందుస్తు బెయిల్ మంజూరు చేసింది. హైకోర్టు ఒకేసారి మూడు కేసుల్లో చంద్రబాబుకు ముందస్తు బెయిల్ మంజూరు చేయడం విశేషం. కాగా, మద్యం కేసులో మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి శ్రీనరేశ్‌కు కూడా బెయిల్ మంజూరైంది.
 
ఇకపోతే.. అమరావతి ఔటర్‌ రింగ్‌ మాస్టర్‌ ప్లాన్‌ అలైన్‌మెంట్‌లో పార్టీ నాయకులకు అనుకూలంగా అలైన్‌మెంట్‌ చేశారని మద్యం టెండర్లలలో, ఉచిత ఇసుక వ్యవహారంలోనూ అక్రమాలకు పాల్పడారని సీఐడీ కేసులు నమోదు చేసింది. ఈ మూడు కేసుల విచారణ పూర్తయ్యేంతవరకు కేసులపై మాట్లాడవద్దని కోర్టు చంద్రబాబుకు సూచించింది.