బుధవారం, 1 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 8 అక్టోబరు 2021 (12:12 IST)

కానిస్టేబుల్‌పై యువకుడు వీరంగం... నెట్టింట వీడియో వైరల్

Man
పోలీసుల వద్ద ఓ యువకుడు వీరంగం సృష్టించాడు. తూర్పుగోదావరి జిల్లా కోరుకొండలో ఈ ఘటన చోటుచేసుకుంది. బస్టాండ్ ఆవరణలో బైక్‌పై వెళ్తున్న తనను ఆపినందుకు.. పోలీసులపై రెచ్చిపోయాడు. 
 
విధి నిర్వహణలో ఉన్న కానిస్టేబుల్‌పై దుర్భాషలాడుతూ కలర్ పట్టుకుని దాడి చేశాడు. పక్కనే ఉన్న పోలీసులు వద్దని వారించినా లెక్క చేయకుండా కానిస్టేబుల్‌పై పిడిగుద్దులు కురిపించాడు.
 
యూనిఫాంలో ఉన్న పోలీస్ కానిస్టేబుల్‌పై యువకుడు దాడి చేసిన ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలోనూ వైరల్‌గా మారింది.