ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 24 ఫిబ్రవరి 2022 (11:45 IST)

చలో అమలాపురం.. బీజేపీ పిలుపు

BJP
బీజేపీ గురువారం చలో అమలాపురం కార్యక్రమానికి పిలుపు నిచ్చింది. ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ వైకాపా ప్రభుత్వంపై యుద్ధానికి సిద్ధమవుతుంది. 
 
ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో నిత్యం ఏదో ఒక కార్యక్రమంతో ప్రజల్లో ఉండాలని బీజేపీ భావిస్తుంది. ఇందుకోసం ప్రజా సమస్యలపై పోరాటాలకు కార్యాచరణను రూపొందించుకుంది.
 
కోటిపల్లి - నరసాపురం రైల్వే లైనుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తమ వాటాను చెల్లించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ చలో అమలాపురం కార్యక్రమానికి పిలుపు నిచ్చింది. 
 
ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావులు పాల్గొంటారు. ఉద్రిక్త పరిస్థితులు తలెత్తే అవకాశమున్నందున పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.