ఏపీలో బీజేపీ పరిస్థితి బాగోలేదు.. విష్ణుకుమార్ రాజు

Last Updated: శనివారం, 12 జనవరి 2019 (11:24 IST)
బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవలే రాజమండ్రి బీజేపీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ కూడా పార్టీని వీడుతున్నట్టు వార్తలొచ్చాయి. బీజేపీని వీడే వారి జాబితాలో విష్ణుకుమార్ రాజు పేరు కూడా ఇప్పుడు వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో విష్ణుకుమార్ రాజు చేసిన సంచలన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. 
 
ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ పరిస్థితి బాగోలేదంటూ విష్ణుకుమార్ రాజు అన్నారు. బీజేపీ ఏపీలో ఒడిదుడుకులను ఎదుర్కొంటుందని.. అందుకే తమ నాయకులు కొందరు పార్టీని వీడారని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేసే విషయం గురించి కూడా ప్రస్తావిస్తూ.. విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని.. ఏ పార్టీ నుంచి పోటీ చేసేది ఎన్నికల కోడ్ వచ్చాక చెబుతానన్నారు. దీనిపై మరింత చదవండి :